E-Paper
Advertisement

పట్టు బిగిస్తున్న బ్యాంకు యూనియన్లు, దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు, ఐదు రోజులతోపాటు

పట్టు బిగిస్తున్న బ్యాంకు యూనియన్లు, దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు, ఐదు రోజులతోపాటు
Advertisement

Bank Unions Strike: మోదీ సర్కార్‌పై దూకుడు పెంచుతున్నాయి వివిధ వర్గాలు. నిన్నటి వరకు జెన్ జీ వంతు కాగా.. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ వంతైంది. తాజాగా దేశవ్యాప్తంగా బంద్‌కు రెడీ అవుతున్నాయి బ్యాంక్ యూనియన్లు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వివిధ అంశాలను చూపిస్తూ బంద్‌కు దిగాలని రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు దిగాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్- యూఎఫ్‌బీయూ నిర్ణయించింది. సమ్మె విషయం తెలియగానే మార్కెట్లో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి.

 

సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపు

Advertisement

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సమ్మె గంట మోగింది. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చింది. వారి డిమాండ్లలో ప్రధానమైనవి. వారానికి ఐదు రోజుల పని దినాల కోసం గడిచిన ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ మంత్రి వద్ద ఉన్నట్లు చెబుతున్నాయి. సదరు మంత్రి సంతకం చేస్తే వారానికి ఐదు రోజులు పద్దతి అమల్లోకి రానుంది. పని తీరు ఆధారిత ప్రోత్సాహకం విధానంలో మార్పుల వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు కొన్నాళ్లుగా పట్టుబడుతున్నాయి. ఆదివారం జరిగిన సమావేశంలో ఆందోళనల షెడ్యూల్‌ను ప్రకటించాయి బ్యాంక్ యూనియన్లు.

Advertisement

 

పట్టు బిగిస్తున్న బ్యాంకు యూనియన్లు

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు రెడీ అయ్యింది. ఆ రోజు శుక్రవారం కావడం, ఆ తర్వాత రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి కావడంతో సెలవు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె చేయాలని డిసైడ్ అయ్యింది.

ఈలోగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పాయి. ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలపై తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయడానికి రెండేళ్ల కిందట ఐబీఏ అంగీకరించింది.

 

దిగిరాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె?

సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి ఉద్యోగులు ఆమోదం తెలిపారు. ఐబీఏ.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. రెండేళ్లు దాటినా ఆమోదముద్ర పడలేదు. కేంద్ర ఆర్థికశాఖ సవరించిన పీఎల్‌ఐ విధానంపై యూనియన్లు భగ్గుమన్నాయి.

కొత్త విధానం ప్రకారం.. స్కేల్-4, ఆపై స్థాయి అధికారులు వారి వ్యక్తిగత పని తీరు ఆధారంగా 365 రోజుల బేసిక్ పే వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. స్కేల్-3 అధికారులు, ఇతర సిబ్బందికి కేవలం 15 రోజుల డీఏ అందనుంది. ఐబీఏతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమన్నది యూనియన్ల వాదన.

ALSO READ: 700 జాబ్స్‌కు దరఖాస్తు చేస్తే ఒక్క ఇంటర్‌వ్యూ మాత్రమే.. ఉద్యోగం కోల్పోయిన టెకీ ఫ్రస్ట్రేషన్

బ్యాంకు పని తీరు ఆధారంగా స్కేల్-7 వరకున్న ఉద్యోగులు, అధికారులకు ఒకే విధంగా పీఎల్‌ఐ వర్తింపజేయాలని కోరుతున్నారు. వీటితోపాటు పెన్షన్ల సవరణ, పెన్షనర్లందరికీ ఒక డీఏ, ఎన్‌పీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారే అవకాశం కల్పించడం వంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని బ్యాంక్ యూనియన్లు కోరుతున్నాయి.

Related News

యూపీఐ లావాదేవీల వ్యవహారం.. సంక్రాంతి తర్వాతే అంటున్న ట్రేడర్లు, ఆలోచనలో ఎన్‌పీసీఐ

రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయా?

వడ్డీ రేట్లు పెంపు ప్రభావం.. బంగారం ధరలు హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు ఎంత?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు ఝలక్.. ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగింపు, ఆర్బీఐ నిర్ణయం వెనుక..

10వ తరగతి తరువాత కమర్షియల్ పైలట్ కావాలంటే ఏం చేయాలి? లైసెన్స్ ఎలా పొందాలి?

డైలీ SIP vs మంత్లీ SIP.. ఏ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వస్తుంది?

వడ్డీ రేట్లు పెంపుతో హోమ్ లోన్‌ వారికి షాక్.. కొత్త గృహాలు కొనేవారికి భారం, నెలకు ఈఎంఐ ఎంతంటే..

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ కావాలా? ఈ బ్యాంక్ కార్డులు తప్పనిసరి

Big Stories

Advertisement
×