E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను చితక్కొట్టిన మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today Episode August 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యాదమ్మను చితక్కొట్టిన మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చంభాను ఎలాగైనా ఫూల్‌ను చేయాలని ప్లాన్‌ చేసిన రాథోడ్‌, మిస్సమ్మ. పార్థు ఇష్టాఇష్టాలేంటి..? పార్థుకు ఇష్ట లేని విషయాల గురించి చంభా వినేటట్టు మాట్లాడుకుంటారు. పార్థుకు బ్లూ కలర్‌ అంటే పరమ అసహ్యం అనుకుంటారు. అసలు అమ్మాయిలు శారీ కట్టుకోవడం అంటేనే పార్థుకు నచ్చదని ట్రెడిషనల్‌ డ్రెస్‌లో ఉండే అమ్మాయిలంటే పార్థు చాలా ఇష్టపడతారని మాట్లాడుకుంటారు. చంభా వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మొత్తం విని వెంటనే వెళ్లి మనోహరికి చెప్తుంది. తాను పార్థు డైరీ చదివానని అందులో ఈ విషయాలు ఉన్నాయని.. పార్థు నిన్ను అసహ్యించుకుని పెళ్లి వద్దని పారిపోతే తనకు రవ్వల నెక్లెస్‌ చేయించాలని అడుగుతుంది. మనోహరి సరే అంటుంది.

తర్వాత పిల్లుల పార్థు టిఫిన్‌ చేస్తుంటారు. అమర్‌, భాగీ ఎక్కడ అని పార్థు అడిగితే.. అదిగో వస్తున్నారు అంటాడు రాథోడ్‌. మిస్సమ్మను శారీలో చూసిన పార్తు మీరు ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నారు అంటాడు. నాకన్న అందంగా మనోహరి రెడీ అవుతుందని మిస్సమ్మ చెప్తుంది. తన కోసమే వెయిట్‌ చేస్తున్నాను అంటాడు పార్థు. అప్పుడే మిస్సమ్మ వెటకరాంగా ఇవాళ ఏంటో యాదమ్మ బోసి మెడ చూస్తుంటే.. బాధేస్తుంది అంటుంది. అందుకు రాథోడ్‌.. మనోహరి పెళ్లి కానుకగా యాదమ్మ రవ్వల నెక్లెస్‌ కొనిపెడుతుందిలే మిస్సమ్మ నువ్వే బాధపడకు అంటాడు. రాథోడ్‌ మాటలకు యాదమ్మ షాక్‌ అవుతుంది. నేను మనోహరితో మాట్లాడింది వీళ్లు విన్నారా ఏంటి..? అని మనసులో అనుకుంటూ మనోహరిని అందరూ నీకోసం వెయిట్‌ చేస్తున్నారు రా అంటూ పిలుస్తుంది. రూంలోంచి మనోహరి వస్తున్నాను యాదమ్మ అంటుంది.

Advertisement

అప్పుడే మనోహరి రూం డోర్‌ తెరుచుకుంటుంది. పార్థు తిరిగి డోర్‌ వైపు చూస్తాడు. బ్లూ కలర్‌ శారీ కట్టుకుని మనోహరి వస్తుంది. నేను చెప్పిన శారీనే కట్టుకుని వస్తుంది మనోహరి అని మనసులో అనుకుంటుంది. మనోహరిని చూసి ఆశ్చర్యపోతాడు పార్థు. మనోహరి దగ్గరకు వచ్చి శారీ ఎలా ఉందని అడుగుతుంది. అందుకు పార్థు చాలా సూపర్‌గా ఉందని.. ఆ శారీలో మనోహరి చాలా అంటే చాలా అందంగా ఉందని చెప్తాడు. పార్థు మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. కోపంగా యాదమ్మ వైపు చూస్తుంది.

అప్పుడే మిస్సమ్మ చూశారా పార్థు గారు మనోహరి మీకు ఇష్టమైన కలర్‌ శారీ కట్టుకుని వచ్చింది అని చెప్తుంది. రాథోడ్‌ కూడా పార్థు చెవిలో సార్‌ మనోహరి గారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైన బ్లూ శారీ కట్టుకుని వచ్చింది.. ఇప్పటికైనా నమ్మండి సార్‌ అని చెప్తాడు. యాదమ్మ మాత్రం భయంతో వణికిపోతుంది. బ్లూ శారీ చూడగానే తిడతాడు అనుకుంటే పొగుడుతున్నాడేంటి అని మనసులో అనుకుంటుంది.  అందరూ టిఫిన్‌ చేశాక మనోహరి కూడా చేతులు కడుక్కుని రూంలోకి వెళ్తూ.. యాదమ్మను తన రూంలోకి రమ్మని సైగ చేస్తుంది. యాదమ్మ భయంగా ఇప్పుడు మనోహరి ఏం చేస్తుందో ఏమో అని భయపడుతుంది.

Advertisement

అందరూ వెళ్లిపోయాక భయం భయంగా యాదమ్మ మనోహరి రూంలోకి వెళ్తుంది. రూంలోకి వచ్చిన యాదమ్మను మనోహరి కొడుతుంది. వెధవ నెక్లెస్‌ కోసం నాకు అబద్దం చెప్తావా..? బ్లూ శారీ అంటేనే తిడతాడు.. అసహ్యించుకుంటాడు అని చెప్పావు..  పార్థు డైరీ చదివాను అన్నావు..? ఇప్పుడు ఏమైంది అంటూ నిలదీస్తుంది. దీంతో జరిగిన విషయం యాదమ్మ, మనోహరికి చెప్తుంది. అంతా విన్న మనోహరి అయితే ఇదంతా ఆ భాగీ, రాథోడ్‌ వేసిన ప్లాన్‌ అన్నమాట అంటూ కోపంగా చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

Big Stories

Advertisement
×