E-Paper
Advertisement

Podarillu Today Episode : జంటను విడగొట్టిన చక్రీ.. తాళి కట్టనన్న కేశవ.. హైలెట్ సీన్ ఇదే..

Podarillu Today Episode : జంటను విడగొట్టిన చక్రీ.. తాళి కట్టనన్న కేశవ.. హైలెట్ సీన్ ఇదే..
Advertisement

Podarillu Today Episode august 25th :చక్రి విక్కిని చూసి చాలా కోపంగానే ఉంటాడు. అయితే ఇద్దరు కలిసి ఈ విక్కీ చాలా స్మార్ట్ గా ఉంటాడు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తనని ప్రేమిస్తే తప్పేంటి ఇతను చాలా మంచి వ్యక్తి కదా అని మహా అనడంతో విక్కి చాలా షాక్ లో ఉన్నట్లు అయిపోతాడు. విక్కీ లాంటి మంచి వ్యక్తిని ఎప్పుడు ఎవరు వదులుకోవాలి అనుకోరు. ఏంటి మీరు అతని ప్రేమిస్తున్నారా అని చక్రి అనగానే మహాలక్ష్మి ఫ్యూచర్లో ప్రేమిస్తానేమో చెప్పలేను కదా అని అంటుంది. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోవడంతో పాటుగా మహాలక్ష్మి నా నుంచి దూరమవుతుందేమో అని టెన్షన్ పడతాడు..

జంటను విడగొట్టిన చక్రీ..

విక్కీ తో ప్రేమలో పడతాను అని చెప్పిన తర్వాత మహాలక్ష్మి నిజంగానే అలా చేస్తుందా అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. నాకోసం తన వాళ్ళతో కూడా నేను దెబ్బలు తిన్నాను. అయినా నా గురించి తను ఆలోచించడం లేదు అని చక్రి అనుకుంటూ బాధపడిపోదు బయటికి వస్తాడు.. అయితే బయట ఒక జంట మేము ప్రేమించుకున్నాము అని సరదాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళని చూసి నా చక్రి మీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా అని ఆపుతాడు. నేను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేశాను దానివల్ల అమ్మాయి ఒప్పుకుని ఉంది అని చెప్పగానే మీరిద్దతి ప్రేమకాదు ఒక్కరి క్లారిటీ తెచ్చుకోండి అని చక్రి అంటాడు. ఈ ప్రపంచంలో అయితే ఇన్ని రోజులు నేను ప్రేమ అనుకున్నాను. కానీ అమ్మాయి నా చుట్టూ తిరుగుతుంది కదా అనుకున్నాను. నాకోసం ఆ మాత్రం కూడా చేయలేదని షాక్ అయిపోతాడు. మొత్తానికి ఒక జంటని చక్రి విడగొడతాడు.

కన్నాకి జోడీ దొరికేసింది..

Advertisement

బస్ స్టాప్ లో కన్నా కొందరు అమ్మాయిలు అతని మీద క్రష్ ఉంది అని అనుకుంటారు.. అయితే ఎక్కడున్నా అమ్మాయిలు కన్నా ఫోటో తీస్తూ వీడు స్వాతిముత్యం లాగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు.. చాలా స్మార్ట్ గా ఉన్నాడు. వీడితో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నాలు చేశాను. కానీ కుదరలేదు అని వాళ్ళు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి నాకు కన్నా వీలైంది నన్ను చూస్తూ నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాడు. కన్నాతో ఎలాగైనా మాట్లాడాలి అని ఒక అమ్మాయి అనుకుంటుంది.మరి కన్నాతో మాట్లాడి ఇద్దరు ప్రేమలో పడతారో లేదో అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే..

శైలు కోరిక తీర్చని కేశవ..

శైలు మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చి తన మెడలో తాళి కట్టాలి అని కోరుతుంది.. నువ్వు వెంటనే నా మెడలో తాళి కట్టకపోతే.. జీవితంలో నేను మళ్లీ నీ దగ్గరికి రాను అని ఎంతగా శైలు బెదిరించాలని చూసిన సరే కేశవ మాత్రం నేను ఇప్పుడు నీ మెడలో తాళి కట్టలేను అని అంటాడు. ఇప్పుడు నా మెడలో తాళికట్టు రా తర్వాత మనిద్దరం అందరి మధ్యలో పెళ్లి చేసుకుందామని ఎంత చెప్తున్నా సరే.. శైలు మాటకి కేశవ నో అని చెప్తాడు. నా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే మంచిది అని శైలుకి అర్థం ఏలా ఎంతగా చెప్పాలని చూసినా కూడా కేశవా వినకపోవడంతో శైలు జీవితంలో నీ మొహం చూడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పంపించాడు. కేశవ ఇక్కడ నాకు జీవితంలో దక్కడు అని శైలు బాధపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మనీషాను పంపించేసిన మాధవ్..

Advertisement

బంసి మనిషి అని తీసుకొని వెళ్లడానికని మాధవల్ల ఇంటికి వస్తాడు.. మనిషాలు బావ ఇక్కడ వెతికి మేము దొరకలేదు అని వెళ్లిపోయాడట.. బీహార్ కి వెళ్ళిపోయాడని మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు మేము మనిషాను తీసుకొని వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు అని అంటారు.. మనిషా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. మాధవ్ కూడా మనీషాని పంపిస్తూ ఉండగా తను కూడా బాధ పడిపోతూ ఉంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా మనిషా వెళ్ళిపోతుంది అని బాధ పడిపోతూ ఉంటారు. మీరు నన్ను ఎప్పుడు ప్రేమగానే చూసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే నాకు చాలా బాధగా ఉంది అని మనిషా కూడా బాధపడిపోతూ ఉంటుంది.

కన్నా మాటతో చక్రీ షాక్..

కన్నా చక్రి అటు ఇటు తిరుగుతుంటే ఏమైంది? ఎందుకు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అని అడుగుతాడు.. నువ్వేంటి రా నా వెనకాల తిరుగుతున్నావు తల్లి వెనకాల పిల్లదిరిగినట్టు అని చక్రీ కూడా వెటకారంగా మాట్లాడుతాడు.. నేను ఏమి అనలేదు నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో అని అనుమానంతో అడుగుతున్నాను అని కన్నా అంటాడు. మీ వదిన ఆ విక్కీని చూసి పడిపోతుందేమోను భయంగా ఉంది నేను మీ వదినని ఎలా ఇంప్రెస్ చేయాలనీ ఆలోచిస్తూ ఉన్నాను అని చక్రి అంటాడు అయితే లోపలికి వెళ్ళిన కన్నా చక్రి డ్రస్సులను తీసుకొని వచ్చి చూపిస్తాడు.. ఇంట్లో ఇల్లు తుడవడానికి ఉపయోగించే క్లాత్ను నువ్వు వేసుకుంటున్నావు మరి నిన్ను చూసి వదిన ఎలా ఇంప్రెస్ అవుతుంది అని కన్నా తనకి ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ఇక చక్రి తన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చాలని ఫిక్స్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: సుకన్యకు వేదవతి షాక్.. ప్రేమకు దొరికిపోయిన ధీరజ్.. సాగర్ గుట్టు రట్టు..

Related News

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

Big Stories

Advertisement
×