Gold Rate Today: ప్రస్తుత బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళుతున్నాయి. నిన్న మోన్నటి వరకూ లక్షకు దాటి పోయింది. అయితే 3 రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,00,480 ఉండగా.. నేడు రూ.99,930 దగ్గర పలుకుతుంది. అలాగే నిన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 ఉండగా.. నేడు రూ.91,600 ఉంది. అయితే నేడు 10 గ్రాముల బంగారంపై రూ.550 తగ్గింది. వరుసగా మూడు రోజుల నుంచి రూ.2,400 తగ్గింది.
శ్రావణం ఎఫెక్ట్.. తగ్గిన బంగారం..
శ్రావణ మాసం వచ్చింది. అందరు బంగారం పెరుగుతుంది అనుకున్నారు. కానీ, శుభకార్యాల వేళ బంగారం ధరలు తగ్గడం చాలా విశేషం అని పసిడి ప్రియులు ఆనందపడుతున్నారు. అంతేకాకుండా 3 రోజుల్లో ఇంతలా తగ్గడం చాలా ఆశ్చర్యకరమంటున్నారు. శుభకార్యాలు, పెళ్ళిళ్లు ఉన్నవాళ్లు ఇప్పుడే కొని పెట్టుకోవడం మంచిది.. లేకుంటే మళ్లీ పెరిగే అవకాశం ఉండొచ్చు..
బంగారం పెరగడానికి స్టాక్ మార్కెట్ నెగెటివిటీ కూడా కారణం..
మన వైపు బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్నటువంటి నెగెటివిటీ కూడా ఒక కారణంగా చెప్పవచ్చంటున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై తలపెట్టిన వాణిజ్య యుద్ధం కూడా బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతుంది అని చెబుతున్నారు. ప్రధానంగా డాలర్ విలువ భారీగా పతనం అవుతోంది.. డాలర్ విలువ పతనం అయ్యే కొద్ది బంగారం ధర పెరుగుతోంది. డాలర్ విలువ ఎంత పతనమైతే బంగారం విలువ అంత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,930 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 వద్ద పలుకుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,080 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,750 కు చేరుకుంది.
Also Read: మల్లారెడ్డితో ఈటలకు చెక్? బీజేపీ ప్లాన్ ఇదేనా?
నేటి వెండి ధరలు..
బంగారంతో పాటు వెండి కూడా కాస్తా తగ్గుముఖం పట్టింది. ఈ మధ్య రోజు రోజుకు స్వల్పంగా తగ్గుతుంది. నిన్న కేజీ వెండి ధర రూ.1,28,000 ఉండగా.. నేడు కేజీ వెండి ధర రూ. 1,26,000కు చేరింది. ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరులో కేజీ వెండి రూ.1,16,000 వద్ద కొనసాగుతోంది.