Gold Rates: బంగారం ధర తగ్గింది అనుకునే లోపే మళ్ళి రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90.440 ఉండగా.. గురువారంకు రూ. 93.380 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర బుధవారం రూ. 82,900 ఉండగా గురువారం 85,600కు చేరింది. గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతు.. తగ్గుతూ వస్తున్నాయి.. కానీ నేడే రికార్డు స్థాయిలో పెరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా పెరుగుతూ పోతుంటే ప్రజలు రేపటి రోజుల్లో బంగారం అంత పెట్టి ఎలా కొనగలుగుతారు అని ప్రశ్నిస్తున్నారు.
బంగారం రెట్లు పసిడి ప్రియులపై పగబట్టినట్టుగా మళ్ళి పెరుగుతూనే ఉంది. అంతార్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఏ క్షణంలో ఏ రేటు ఉంటుందో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు బంగారం కొనాలంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర లక్షకు దూసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
నిన్న, మెున్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా దూసుకెళుతుంది. నిన్న మంగళవారం నుంచి బుధవారానికి తులంపై 600 పెరగగా.. బుధవారం నుంచి గురవారంకు 3000 పెరిగింది. రికార్డు స్థాయిలో బంగారం ధర పెరుగుతూ పోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగులు తీస్తుంది. ట్రంప్ చేసే పనుల వల్ల బంగారం రేటు ఏ సమయంలో ఎలా ఉంటుందో నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
Also Read: ఈ ప్రభుత్వ స్కీం నుంచి మహిళలకు రూ. 10 లక్షల వరకు సులభంగా రుణాలు..
ఇదెందయ్యా పెరుగుతు.. తగ్గుతు..
పసిడి ప్రియులు బంగారం ధర తగ్గిందని, మళ్ళి పెరుగుతుందని కొని పెట్టుకుందాం అని ఆశలు పెట్టుకునేలోపే ప్రజలు ఆశల పై నీళ్లు చల్లినట్లయింది. ఇలాగే పెరిగితే బంగారం షాపుల్లో రద్ధి తగ్గుతుంది. దీంతో ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తుంటారు. వారం రోజులుగా తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా ఇంతలా పెరగడం ప్రజలు అస్థవ్యస్థమవుతున్నారు.. రోజు రోజుకు బంగారం ఇలాగే పెరిగితే ప్రజలు బంగారం కొనాలంటేనే బయపడుతుంటారు. ఇంకా బంగారం ఇలాగే పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనే దాని పై ప్రశ్నలు రేకేత్తిస్తున్నాయి.