Hanumakonda: హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహేల్ మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం చేశాడు. ఓ మహిళను తన గదిలోకి పిలిపించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుడి బారి నుంచి తప్పించుకొని బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణలో నిందితుడిపై కలెక్టర్ సస్పెండ్ వేటు వేసి.. ఆపై పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌లో కేసు నమోదు చేశారు.