BigTV English

Riyan parag: రియాన్ పరాగ్ ఔట్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందా

Riyan parag: రియాన్ పరాగ్ ఔట్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందా

Riyan parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా ఏప్రిల్ 9 {బుధవారం} రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో ఓటమి ద్వారా రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో విఫలమైన రాజస్థాన్ రాయల్స్.. ఈ సీజన్ లో మూడో ఓటమిని మూటగట్టుకుంది. హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.


 

రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ {RR} జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ వరుస రెండు విజయాల పరంపరకు అహ్మదాబాద్ లో బ్రేక్ పడింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.


కేవలం 53 బంతులలోనే 82 పరుగుల ఇన్నింగ్స్ ని ఆడాడు. అలాగే జోస్ బట్లర్ 36, షారుఖ్ ఖాన్ 36 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, తీక్షణ 2 వికెట్లు పడగొట్టారు. ఇక భారీ టార్గెట్ చేదనలో రాజస్థాన్ కి మంచి శుభారంభం లభించలేదు. యశస్వి జైస్వాల్ {6} మరోసారి నిరాశపరిచాడు. సంజు శాంసన్ 41, రియాన్ పరాగ్ 26, హిట్ మేయర్ 52 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. కానీ జట్టుకు విజయాన్ని అందించే వరకు క్రీజ్ లో నిలబడలేకపోయారు.

అయితే ఈ మ్యాచ్ లో బిఆర్ఎస్ నిర్ణయం ఇప్పుడు వివాదానికి దారితీసింది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో రియాన్ పరాగ్ కీపర్ క్యాచ్ గా అవుట్ అయ్యాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రియాన్ పరాగ్ డిఆర్ఎస్ కి వెళ్ళాడు. ఆ తర్వాత బిఆర్ఎస్ నిర్ణయం పై రియాన్ పరాగ్ అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ కి వెళ్లాల్సి వచ్చింది. సమీక్ష తీసుకున్న తర్వాత కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చలేదు.

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్ సమయంలో నాలుగవ బంతిని దాదాపు యార్కర్ గా సంధించాడు. దీనిని రియాన్ థర్డ్ మ్యాన్ వైపు ఆడాలని అనుకున్నాడు. కానీ అతడి బ్యాట్ కింద పడగానే.. బంతి దగ్గరగా వెళ్లి వికెట్ కీపర్ చేతికి చిక్కింది. దీంతో అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు. అయితే రియాన్ దీనిపై డిఆర్ఎస్ సహాయం తీసుకున్నాడు. అందులో బ్యాట్ పిచ్ ని బలంగా తాకింది. దాని శబ్దం స్నికోమీటర్లో వినిపించిందని స్పష్టంగా కనిపించింది.

 

ఆ తర్వాత ఫ్రేమ్ లో బంతి బ్యాట్ ని దాటుతున్నట్లు కనిపించిన వెంటనే.. స్నికోమీటర్ లోని శబ్దం బిగ్గరగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ అంపైర్ రియాన్ పరాగ్ ని అవుట్ గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయం పట్ల రియాన్ పరాగ్ సంతోషంగా కనిపించలేదు. నేరుగా అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెవిలియన్ కి వెళ్ళిపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో 14 బంతులు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×