Gold rate: బంగారం మీద ఇంకా పూర్తిగా ఆశలు చంపుకోవాల్సిందే.. రోజు రోజుకు ఆగకుండా పెరుగుతున్నాయి.. బంగారం ధర తగ్గడం ఇంకా కష్టమేనా..! అంటున్న పసిడి ప్రియులు..
నేటి పసిడి ధరలు..
మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,890 వద్ద పలుకుతోంది.. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,17,650 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,150 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.540 పెరిగింది..
మండిపోతున్న బంగారం ధరలు..
బంగారం ధరలు రోజూ ఇలాగే పెరిగితే పెళ్ళిళ్లు, శుభకార్యాలు పట్టుకున్న వాళ్లు ఇంకా రోల్డ్‌గోల్డ్ తోనే సరిపెట్టుకోవాలి.. బంగారంపై ఇంకా ఆశ చంపుకోవాల్సిందే.. అసలు పసిడి ఎందుకు ఇలా పెరుగుతుంది..? ముందు మందు బంగారం ఇంకా పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనేది అందరి మెదడులో తిరుగుతున్న ప్రశ్న..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,28,890 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,150 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,890 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,150 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,890 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,150 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,040 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,18,300 వద్ద ఉంది.
Also Read: దారుణం.. రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై దుండగుడు అత్యాచారం!
నేటి సిల్వర్ ధరలు ఇలా..
సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. రోజు ఇలాగే పెరిగితే ఇంకా సిల్వర్ కొనడం కూడా కష్టమే అంటున్నారు ప్రజలు.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,06,000 కాగా.. బుధవాంరం కేజీ సిల్వర్ ధర రూ.2,07,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 1,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,90,000 వద్ద కొనసాగుతోంది.