Noman Ali Welding Glasses: పాకిస్తాన్ ప్లేయర్ల ఇజ్జత్ తీసేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేయాల్సిన పనిలేదు. వాళ్లకు వాళ్లే అంతర్జాతీయంగా పరువు తీసుకుంటున్నారు. వాళ్ల గోతిలో వాళ్లే పడుతున్నారు. బాయిలో దూకిన వాడు పైకి ఎక్కుతుంటే, పైకి లేపాలి కానీ, కాలు పట్టి కిందికి లాగే వాళ్ళు తప్ప వాడిని కాపాడదాం అన్న నాథుడే లేడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఇదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ ప్లేయర్లపై సొంత దేశపు మాజీ క్రికెటర్లు అనవసర కామెంట్లు చేసి పరువు తీస్తున్నారు. పాకిస్తాన్ స్టార్ బౌలర్ నోమన్ అలీ ( Noman Ali) పెట్టుకున్న కళ్ళజోడు పై రమీజ్ రాజా ( Ramiz Raja) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నోమన్ అలీ పెట్టుకున్న కళ్లద్దాలు వెల్డింగ్ షాప్ వాళ్ళు పెట్టుకుంటారని అవమానించాడు. ఆ కళ్ళజోడు వింతగా ఉందని సెటైర్లు పేల్చాడు. దీంతో రమేష్ రాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ పరువు పోయేలా వ్యవహరిస్తున్నాడు కామెంటేటర్ రమీజ్ రాజా. మొన్న DRS తీసుకున్న సమయంలో బాబార్ అజాం డ్రామాలు వాడుతున్నాడని రమీజ్ రాజా కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు నోమన్ అలీ వెల్డింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడని సెటైర్లు పేల్చాడు. దీంతో రమీజ్ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్.
సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల కిందట మొదటి టెస్ట్ ప్రారంభమైంది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ తొలి టెస్ట్ జరుగుతోంది. ఇందులో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. మరో 136 పరుగులు చేస్తే పాకిస్తాన్ పై విజయం సాధిస్తుంది దక్షిణాఫ్రికా. అయితే మరో నాలుగు వికెట్లు పాకిస్తాన్ సాధిస్తే ఫలితం తారు మారవుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 378 పరుగులకు అలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 167 పరుగులకు కుప్పకూలింది.
అటు సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు నరస పోయి 142 పరుగులు చేసింది. మరో 135 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఎక్కువ శాతం సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు అలాగే మూడు టి20లతో పాటు మూడు వన్డే మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. పాకిస్తాన్ దేశంలోనే ఈ పూర్తి సిరీస్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది.
?igsh=MXNoZXczcGFuNXJ5dg%3D%3D