Tollywood:చిత్ర పరిశ్రమలో ఈరోజు రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం ప్రముఖ అమెరికన్ సింగర్ డి’ఏంజెలో క్యాన్సర్ తో పోరాడుతూ 51 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోక ముందే ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ సింగర్ గా, నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రావు బాల సరస్వతి దేవీ (Rao Bala Saraswati Devi)తుది శ్వాస విడిచారు.
లలిత సంగీత సామ్రాగ్నిగా పేరు సొంతం చేసుకున్న మహిళా గాయని రావు బాల సరస్వతి దేవి ఈరోజు తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 97 సంవత్సరాలు. అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియలేదు. కానీ ఆమె వయసును బట్టి చూస్తే వృద్ధాప్య సమస్యలతోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. తన నటనతో, గాత్రంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆమె.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలి దశలోనే అనేక మధుర గీతాలను ఆలపించి, గొప్ప సంగీత కళాకారిణిగా పేరు సొంతం చేసుకుంది.
1928 ఆగస్టు 29న జన్మించిన ఆమె.. ఆరవ ఏటనే గాయనిగా పాటలు ఆలపించడం మొదలుపెట్టారు. పాతతరం తెలుగు చిత్రాల నటిగా, నేపధ్యగాయనిగా కూడా ప్రసిద్ధి పొందారు బాల సరస్వతి దేవి. ప్రస్తుతం ఆమె మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె జన్మస్థలం మద్రాసు. పార్థసారథి, విశాలాక్షి దంపతులకు జన్మించింది. ఆమె తాతగారు మద్రాస్ హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. బాల సరస్వతి ఎక్కువగా చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్ అనే సినిమా థియేటర్ కూడా ఉండేది. దానితో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం మొత్తం గుంటూరుకు తరలివచ్చింది.
ఇకపోతే హెచ్ఎంవి ద్వారా ఈమె పాడిన పాటలను విన్న సి. పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె వయసు కేవలం ఏడేళ్లు మాత్రమే. ఈ విధంగా 80 ఏళ్ల క్రితం తన మొదటి చిత్రంలో నటించిన బాల సరస్వతి దేవి 200 రూపాయలు ఈ సినిమా కోసం మొదటి పారితోషకంగా తీసుకుంది. ఈ చిత్రంలో గంగా పాత్రలో పాడుతూ ,నటించింది. 1936లో విడుదలైన ఈ సినిమాలో సుమారుగా 60 మంది చిన్నపిల్లలు నటించడం ప్రత్యేకత.
also read:HBD Sai Dharam Tej: మెగా కాంపౌండ్ హీరో… ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా ?
1944లో తిరిగి మద్రాస్ చేరుకున్న వీరు ఒకసారి వీరి అత్తయ్య, మామయ్యలతో మద్రాస్ గిండీలోని గుర్రపు రేసు చూడడానికి వెళ్లారట. అప్పటికి బాల సరస్వతి 15 సంవత్సరాలు . వెంకటగిరి మహారాజు గారి నాలుగవ కుమారుడు ప్రద్యుమ్న, కృష్ణ , సూర్యరావు కూడా అక్కడికి వచ్చారు. ఆయన కోలంక రాజావారు. వారి గుర్రాలు కూడా ఆ రేసులో పాల్గొన్నాయి. అక్కడ ఈమెను చూసి.. ఈమె పాటలు బాగా పాడుతుందని, సినిమాల్లో కూడా నటిస్తుందని తెలుసుకున్నాక.. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడిగారట. అయితే ఈమె తండ్రి ఈమెను అడగమని చెప్పడంతో రాజావారు అడగగా కాదనలేకపోయింది. అయితే ఆయనకు ఈవిడకు అప్పుడు దాదాపు 19 సంవత్సరాలు తేడా ఉందట. అలా 1944లోనే కోలంక రాజా వారితో బాల సరస్వతి దేవి వివాహం జరిగింది