London Squeeze Silver Hike:దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ అమాంతం పెరగడంతో ‘వెండి’ ధర పరుగులు పెడుతోంది. వెండి మార్కెట్ బంగారం కంటే తొమ్మిది రెట్లు తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ డిమాండ్ భారీగా ఉందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ విశ్లేషకులు తెలిపారు.
లండన్‌లో వెండి నిల్వలు తగ్గడంతో ధరలు ఔన్సుకు 52.50 డాలర్లు కంటే పైకి ఎగబాకాయి. వెండిని సురక్షితమైన ఆస్తిగా భావించడంతో పెట్టుబడుల ర్యాలీ ఊపందుకుంది. లండన్ స్క్వీజ్ తో వెండి ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.
లండన్‌లో వెండి స్పాట్ ధర ఔన్సుకు 52.5868 డాలర్లకి అంటే 0.4% పెరిగాయి. వరుసగా ఎనిమిది వారాల పాటు లాభాలతో నడుస్తూ బంగారం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది.
లండన్‌లో వెండి లిక్విడిటీ తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెండి మార్కెట్లపై వినియోగదారుల చూపు పడింది. న్యూయార్క్ మార్కెట్ లో వెండి బెంచ్‌మార్క్ ధరలు దాదాపు గరిష్ట స్థాయికి పెరిగాయి. లండన్ మార్కెట్ లో అధిక ధరల నేపథ్యంలో లాభం పొందడానికి కొంతమంది వ్యాపారులు అట్లాంటిక్ విమానాలలో కార్గో స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా బంగారం కోసం రిజర్వు చేసే కార్గో స్లాట్ లలో వెండి కడ్డీలు రవాణా చేస్తున్నారు. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో వెండి ప్రీమియం ధర ఔన్సుకు దాదాపు 1.55 డాలర్ల వద్ద ఉంది. గత వారం ఇది 3 డాలర్లకు చేరింది.
లండన్ మార్కెట్లో వెండి లీజు రేట్లు ఈ ఏడాది అమాంతం పెరిగాయి. గత నెలలో ఈ ధరలు 30% కంటే ఎక్కువ పెరిగాయి. షార్ట్ పొజిషన్లను రోల్ ఓవర్ చేయాలనుకునే వారు అదిరిపోయే లాభాలు చూస్తున్నారు.
ఇటీవలి భారతదేశంలో కూడా వెండికి డిమాండ్ పెరగడంతో లండన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న సిల్వర్ బార్ ల సరఫరా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.