Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టు పల్లిలోని కే చంద్ర రెడ్డి రిసార్ట్‌లో రేవు పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏపీ కి చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ యాజమాన్యం రేవు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సీడ్స్ ఓనర్లు, డీలర్లు పాల్గొన్నారు. కంపెనీ యాజమాన్యం లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది. డయిల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి ప్రవేశించి ఆకస్మిక దాడిచేసి పార్టీని భగ్నం చేశారు. లిక్కర్ కోసం అధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ అమ్మాయిలను తీసుకురావడం చట్ట విరుద్ధమని పోలీసులు తెలిపారు. దీంట్లో మెుత్తం 72 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.