Niharika: మెగా డాటర్ నిహారిక(Niharika) ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కానీ అనంతరం హీరోయిన్ గా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నిహా హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేశారు. ఇలా పెళ్లి చేసుకున్న నిహారిక కొన్ని కారణాలవల్ల వైవాహిక బంధానికి దూరంగా ఉంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఇటీవల నిహారిక నిర్మాతక వ్యవహరించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమె తన రెండో సినిమాని కూడా ప్రారంభించారు. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ అంటూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఆయనతో కలిసిన ఒక క్యూట్ ఫోటోని షేర్ చేశారు. తేజ్ ఏదో చెప్పబోతుండగా ఈమె నోటికి తన చేతిని అడ్డుగా పెట్టి నవ్వుతూ ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన నిహారిక హ్యాపీ బర్త్ డే బావా! లవ్ యూ!! అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అభిమానులు కూడా సాయిధరమ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటో చూసిన కొంతమంది అభిమానులు మాత్రం వీరిద్దరి పెళ్లి గురించి కూడా కామెంట్లు చేస్తున్నారు. నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒకానొక సమయంలో వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ ఆ వాస్తవమని తెలుస్తోంది.
సంబరాల యేటిగట్టు..
ఇక సాయిధరమ్ తేజ్ సైతం తన సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే సంబరాల యేటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది. ఇక నిహారిక కెరియర్ విషయానికి వస్తే ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రెండో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది.మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ జోనర్‌లలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.