Pankaj dheer: పంకజ్ ధీర్(Pankaj Dheer) కంటే మహాభారతంలో కర్ణుడి(Mahabharats Karna)గా ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పంకజ్ ధీర్ నేడు కన్నుమూశారు. 68 సంవత్సరాల వయసులో ఈయన క్యాన్సర్ (Cancer)తో పోరాటం చేస్తూ ఈ పోరాటంలో తనువు చాలించారు. ఈ విధంగా నటుడు పంకజ్ మరణించారు అనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆ షాక్ అవ్వడమే కాకుండా ఈయన మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. గత కొంతకాలంగా పంకజ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు అయితే ఈ వ్యాధి నుంచి ఈయన బయటపడినప్పటికీ తిరిగి మరోసారి క్యాన్సర్ సోకడంతో పూర్తిగా ఈయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది.
క్యాన్సర్ బారిన పడటంతో గత కొంతకాలంగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న పంకజ్ పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అధికారిక ప్రకటన విడుదల చేశారు.అక్టోబర్ 15న ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో పంకజ్ ధీర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. గతంలో పంకజ్ ధీర్ సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ గౌరవ ప్రధాన కార్యదర్శిగా, ట్రస్ట్ చైర్మన్‌గా పనిచేశారని తెలుస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలోనూ టీవీ రంగంలోనూ ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన పంకజ్ ధీర్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇక ఈయన1988లో బి.ఆర్. చోప్రా మహాభారతం సీరియల్లో కర్ణుడి పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ కర్ణుడి పాత్ర ద్వారా ఈయన పేరు మారుమోగిపోయింది. ఇలా మహాభారతం సీరియల్ తో పాటు పంకజ్ చంద్రకాంత, బధో బహు, జీ హారర్ షో, కానూన్ వంటి టీవీ సీరియల్స్ లో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా సీరియల్స్ తో పాటు, సోల్జర్, అందాజ్, బాద్‌షా మరియు తుమ్‌కో నా భూల్ పాయేంగే వంటి సినిమాలు కూడా చేస్తూ వెండి తెరపై అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు.
నటుడిగా, దర్శకుడిగా పంకజ్ ధీర్…
ఇక నటుడు పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్ కూడా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.నికితిన్ చెన్నై ఎక్స్‌ప్రెస్, జోధా అక్బర్ వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక పంకజ్ కుటుంబానికి కూడా ఇండస్ట్రీలో మంచి సినీ నేపథ్యం ఉంది. పంకజ్ ధీర్ ప్రముఖ సినీ నిర్మాత సీఎల్ ధీర్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక పంకజ్ సైతం నటుడిగా మాత్రమే కాకుండా గీతా బాలి నటించిన బహు బేటీ, జిందగీ వంటి సినిమాలకు కూడా ఈయన దర్శకుడిగా పనిచేశారు. ఇలా నటుడిగా దర్శకుడిగా వెండితెరపై బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పంకజ్ 68 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారని విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Niharika: లవ్ యూ బావ.. క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. ఫోటో వైరల్!