Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పరుగులు పెడుతుంది. నెల క్రితం లక్ష మార్క్ దాటవేసిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రోజు రోజు మరింత పెరుగుతూ మళ్లీ లక్షకు చెరువలో ఉంది. 93 వేలకు దిగోచ్చిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు 98 వేలకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళనకు గురవుచున్నారు. అయితే నిన్న శుక్రవారం తులం బంగారం ధర రూ.97,530 ఉండగా.. నేడు శనివారం 24 క్యారట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 98,080 కు చేరింది. అంటే రూ.550 పెరిగింది. అలాగే 22 క్యారట్ల తులం బంగారం ధర శుక్రవారం నాడు రూ.89,400 ఉండగా.. నేడు శనివారం రోజూ తులం బంగారం ధర రూ. 89,900 కు చేరింది. అంటే 500 పెరిగింది.
అయితే మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు వారం రోజుల క్రితం నుంచి కాస్త తగ్గగా పసిడి ప్రియులు కాస్త ఊపిరి పిల్చుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ బంగారం పరుగులు పెట్టడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. బంగారం ధరలు ఇలా పెరుగుతుూ పోతే మహిళలకు కన్నీళ్లు తప్పవా? బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? లేదా మళ్లి తగ్గుతాయా? అని పసిడి ప్రియులు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లపై షాకింగ్ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ లిమిటెడ్ ఆఫర్
అయితే బంగారం ధరలు పరుగులు పెడుతుండగా వెండి మాత్రం స్వల్పంగా తగ్గుతుంది. నేడు కిలో వెండిపై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌లో నేడు కిలో వెండి ధర రూ.1,10,900 అమ్ముడవుతుంది.