Arjun Ambati: టాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ అంబటి అర్ధనారి సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయన నుండి వచ్చిన తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్, బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి.ఆయన సీరియల్స్ లోను నటించి మెప్పించారు. ఇక తాజాగా అర్జున్ అంబటి పరమపద సోపానం మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. నాగ శివా దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. గుడిమెట్ల శివప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చమైన తెలుగు టైటిల్ తో ఈ సినిమా రూపొందించారు. థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ లో జెనీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని షురూ చేసింది. తాజాగా ఈ చిత్రం నుండి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కొద్దిసేపటికి భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంది.ఆ వివరాలు చూద్దాం..
బిగ్ బాస్ ఫెమ్ అంబటి ..పరమపద సోపానం..
అర్జున్ అంబటి హీరోగా, జెనీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పరమపద సోపానం. ఈ చిత్రం నుండి ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిన్ని చిన్ని తప్పులేవో పాటకి ఆయన అందించిన ట్యూన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ పాటను పృథ్వి చంద్ర, అతిధి భావరాజు ఆలపించారు. మాస్ మహారాజ్ ఈగల్ వంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించడం తో పాటలు ఎంతో ట్రెండీగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి రాంబాబు గోశాల సాహిత్యాన్ని అందించారు. తాజాగా విడుదలైన ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకొని, యూత్ మ్యూజికల్ ఆల్బమ్ గా చేరిపోయింది.
లిరికల్ వీడియో..టీజర్ ..సూపర్
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాగ శివ టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేశారు. ఈ చిత్రానికి కదా, మాటలు స్క్రీన్ ప్లే, నాగ శివ అందిస్తున్నారు. ఎస్ ఎస్ మీడియా బ్యానర్ పై గుడిమెట్ల శివప్రసాద్ గుడిమెట్ల ఈశ్వర్, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం డేవ్ జాండ్ అందించగా, సినిమాటోగ్రఫీ ఈశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా గుణపర్తి నారాయన్ రావు పనిచేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ టీజర్ లో ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాలసర్పము కంటపడకుండా ఎగిరిపోవాలి… అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. టీజర్ ఆసక్తికరంగా సాగుతుంది సినిమా లో డెప్త్ తెలిసేలా యాక్షన్స్ సన్నివేశాలకు ప్రయారిటీ ఇచ్చారు. టీజర్ లో వినిపించిన డైలాగ్స్ కి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధాన అంశాలుగా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రం జూన్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.