BigTV English

The Devils Chair Trailer: ‘ది డెవిల్స్ ఛైర్’ ట్రైలర్ రిలీజ్.. అదిరే అభి యాక్టింగ్ ఎలా ఉందంటే..?

The Devils Chair Trailer: ‘ది డెవిల్స్ ఛైర్’ ట్రైలర్ రిలీజ్.. అదిరే అభి యాక్టింగ్ ఎలా ఉందంటే..?

The Devils Chair Trailer: అదిరే అభి.. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ (Jabardast ) లో కమెడియన్గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించారు. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారిని వెతికి పట్టుకొని మరీ జబర్దస్త్ లో అవకాశం కల్పించి, వారి పాలిట దేవుడిగా నిలిచారు. హైపర్ ఆది లాంటి వారిని కూడా అదిరే అభి ఇండస్ట్రీకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే కమెడియన్ గా ఎన్ని రోజులు ప్రేక్షకులను అలరించిన అభి ఇప్పుడు హీరోగా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే గంగ సప్తశిఖర (Ganga Saptashikhara) దర్శకత్వంలో అదిరే అభి హీరోగా, స్వాతి మందల్ (Swathi Mandal) హీరోయిన్ గా రాబోతున్న చిత్రం “ది డెవిల్స్ చైర్”. ఈ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.


ట్రైలర్ ఎలా ఉందంటే..?

ట్రైలర్ విషయానికి వస్తే.. విక్రమ్ (అదిరే అభి) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే అతను తన జీతాన్ని జీవితాన్ని బెట్టింగ్లకు అంకితం చేశాడు. బెట్టింగ్లో పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే.. ఒకరోజు కంపెనీకి సంబంధించిన కోటి రూపాయలు డబ్బుతో బెట్టింగ్ కి దిగిపోతాడు. కానీ ఓడిపోతాడు. ఉద్యోగం పోతుంది. యాజమాన్యం కేసు వేస్తుంది. జీవితం అంధకారంలోకి పడిపోతుంది. అప్పుడే అతని ప్రేయసి రుధిర (స్వాతి మందల్) విక్రమ్ జీవితంలోకి వచ్చి అండగా నిలుస్తుంది. ఆర్థికంగా సహాయపడుతుంది. తన ఇంట్లో చోటు కూడా ఇస్తుంది. అయితే ఇక్కడే అసలు కదా మలుపు తిరుగుతుంది. వాస్తవానికి రుధిరకి యాంటిక్ పీస్ కలెక్ట్ చేయడం ఇష్టం. అందులో భాగంగానే వాళ్ళ ఇంట్లోకి ఒక యాంటిక్ చైర్ ను తీసుకొస్తుంది. మరొకవైపు విక్రమ్ ప్రతిసారి డబ్బులు అడిగేసరికి విసిగిపోయి తన దగ్గర డబ్బులు లేవంటూ కోప్పడుతూ ఉంటుంది రుధిర. అప్పుడు విక్రమ్ ఒక కుర్చీకి ఇచ్చిన విలువ నాకు ఇవ్వలేదంటూ బాధపడి పోతాడు. ఇక రుధిర తన పని మీద బయటకు వెళ్ళినప్పుడు విక్రమ్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు. ఉల్లిపాయలు తరుగుతున్న క్షణంలో ఒక్కసారిగా కత్తి తెగి రక్తం వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న ఆ యాంటిక్ చైర్ యాక్టివేట్ అవుతుంది. అందులో సడన్గా ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. దేవుడు కాదు.. అది ఒక డెవిల్. ఇక తనకు ఇచ్చిన రక్తానికి కొంత డబ్బు బహుమానంగా ఇస్తుంది ఆ ఆత్మ. ఆ తర్వాత మళ్లీ విక్రమ్ కి డబ్బు అవసరమవుతుంది. ఆ చైర్ నుంచి డబ్బు ఎలా పొందాలో బాగా ఆలోచించి, రక్తం ఇస్తే డబ్బులు ఇస్తుంది అని అసలు రహస్యాన్ని కనుక్కుంటాడు విక్రమ్. అలా డబ్బు కోసం ఆ చైర్ లో ఉండే ఆత్మ చెప్పేవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా యాజమాన్యం నుంచి ఒత్తిడి వస్తుంది. డబ్బు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రెషర్ పెడుతుంది. అప్పుడు ఆ ఆత్మ నీ ప్రేయసిని చంపేస్తే రూ.కోట్లు ఇస్తానని చెబుతుంది. ఇక దాంతో అసలు కథ మొదలవుతుంది..? విక్రమ్ ఏం చేశాడు.? డబ్బుల కోసం తన ప్రేయసిని నిజంగానే చంపేశాడా? ఎందుకు ఆ చైర్ నిజంగానే విక్రమ్ ను టార్గెట్ చేసింది? అనే విషయాలు తెలియాలి అంటే ఇక సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.


ALSOR EAD:Producers Meet : చర్చలు మళ్లీ వాయిదా… ఈ పంచాయితీకి ఇక పరిష్కారం లేదా..?

విశ్లేషణ..

ఈ ట్రైలర్ చూసిన అభిమానులకు ఎలా అనిపిస్తోందంటే.. సాధారణంగా ఒక హార్రర్ థ్రిల్లర్ సినిమా అంటే తెర నిండా భయంకర వాతావరణం కల్పించాలి. కథ ఆరంభం అవ్వగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవ్వాలి. పాత్రలు కనిపించగానే అసలు ఏమవుతుందో ఊహించలేని సంఘటనలు జరగాలి. కానీ ది డెవిల్స్ చైర్ లో ఏవి కూడా పెద్దగా కనిపించడం లేదు. అన్ని ఆలోచనలు ఆ కుర్చీ మీదే ఆగిపోయాయి. డైరెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు కానీ నటీనటులను ఎంచుకోవడంలో మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు అభి యాక్టింగ్ కూడా బాలేదు. మూవీ కూడా స్లోగానే అనిపిస్తుంది. డైరెక్ట్ గా ఓటీటీ అయినా మరీ ఇంత స్లోగా ఉంటే చూడడానికి కష్టంగా అనిపిస్తుంది. మూవీ స్లోగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి దాంతో ఎడిటింగ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సినిమా మొత్తం కూడా ఒకే ఇంట్లో తీసినట్లు అనిపిస్తోంది. ఇది చూసే ఆడియన్స్ కి బోర్ కొట్టవచ్చు. ఒకే లొకేషన్స్ సినిమా అంటే చూసిన సీనే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అటు లొకేషన్స్ మార్చినా కూడా సినిమాపై అంచనాలు పెరుగుతాయి. అటు ట్రైలర్ లోనే భారీగా తప్పులు కనిపిస్తున్నాయి. వీటన్నింటిని సరి చేసుకుంటే కచ్చితంగా సినిమాను ఒక మోస్తారు వరకు లాక్కెళ్లొచ్చు అని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×