Arshdeep Singh: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్స్ లో పాకిస్థాన్ పై టీమిండియా ఏకంగా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే… ఈ మ్యాచ్ నేపథ్యంలో అర్ష్ దీప్ సింగ్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. Final Match, What’s Happening…అంటూ ఓ వీడియో తీసి… సోషల్ మీడియలో పంచుకున్నాడు అర్ష్ దీప్ సింగ్. పాక్ జట్టును ట్రోలింగ్ చేస్తూ… ఈ వీడియోను క్రియేట్ చేశారు అర్ష్ దీప్ సింగ్. అంతేకాదు… ఇందులో టీమిండియా ప్లేయర్లను కూడా ఇన్వాల్వ్ చేశారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో Final Match, What’s Happening… అనే మరోసారి వైరల్ గా మారింది.
ఆండ్రీ రస్సెల్ కు ఎదురైన సంఘటనను టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. గతంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ గెలిచిన అనంతరం ఆండ్రీ రస్సెల్ ను ఓ విలేకరి.. విన్నింగ్ మూమెంట్స్ గురించి ప్రశ్నిస్తాడు. ఈ తరుణంలోనే.. Final Match, What’s Happening అంటూ ఆండ్రీ రస్సెల్ ను సదరు విలేకరీ ప్రశ్నిస్తాడు. దీంతో అతడు ఏం అడిగాడో అర్థం కాక.. ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) తలపట్టుకున్నాడు.
అసలు ఆ విలేకర్ ఏం అడిగాడు…వాడికి ఏ ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాక.. తలపట్టుకున్నాడు ఆండ్రీ రస్సెల్. ఆ తర్వాత నిమ్మలంగా ఈ ప్రశ్నను మరోసారి అడిగితే అర్థం చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే….అదే వీడియోను గుర్తు చేస్తూ… అర్షదీప్ సింగ్ ఇమిటేట్ చేస్తూ వీడియో చేశాడు. Final Match, What’s Happening అంటూ అభిషేక్ శర్మ, జితేష్ శర్మ, హర్శిత్ రాణా, తిలక్ వర్మలను ప్రశ్నిస్తూ వీడియో తీశాడు అర్షదీప్ సింగ్. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా…. జెట్స్ గురించే చర్చ జరిగింది. మొదట హరీస్ రవూఫ్ గెలికాడు. ఇండియా జెట్స్ పేల్చేశామని..మొత్తం ఆరింటిని పేల్చినట్లు టీమిండియన్స్ ను రెచ్చగొట్టాడు. ఇక దానికి అర్శదీప్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. మీ పాకిస్థాన్ జెట్స్ ను మడిచి పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చాడు. దీంతో అతనిపై వేటు వేయాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. బ్యాన్ విధించాలని కూడా డిమాండ్ చేస్తోంది పాక్.
ARSHDEEP SINGH, AN ENTERTAINER…!!! 😍🔥 pic.twitter.com/2WSVVsIVVt
— Johns. (@CricCrazyJohns) September 28, 2025