BigTV English

Royal Enfield Guerrilla 450 Launch: కొత్త బైక్‌ లాంచ్ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..!

Royal Enfield Guerrilla 450 Launch: కొత్త బైక్‌ లాంచ్ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు..!

Royal Enfield Launched Guerrilla 450CC Bike: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మార్కెట్‌లో సూపర్ క్రేజ్ ఉంది. అయితే ఈ కంపెనీ నుంచి Royal Enfield Guerrilla 450 బైక్ అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లో లాంచ్ అవుతుందని ఇది వరకు కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ కంపెనీ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా Royal Enfield Guerrilla 450 బైక్‌ను లాంచ్ చేసింది. షెర్పా 450 ప్లాట్ ఫార్మ్ ఆధారంగా లాంచ్ అయిన ప్రీమియం మోడరన్ రోడ్‌స్టర్ బైక్‌గా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.


హిమాలయన్ 450 ఇంజిన్ మాదిరిగానే ఈ బైక్‌లో అదే ఇంజిన్‌ను అమర్చారు. 452 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ Royal Enfield Guerrilla 450 బైక్‌లో ఉంది. ఈ బైక్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయడంతో కంపెనీ సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ Royal Enfield Guerrilla 450 బైక్‌లో 452 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ షెర్ప ఇంజిన్, 4వాల్వ్ డిఓహెచ్‌సీను అందించారు. ఇది 8,000rpm వద్ద 40hp, 5,500rpm వద్ద 40Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?


కాగా Royal Enfield Guerrilla 450 బైక్‌లో ట్విన్ పాస్ రేడియేటర్, ఇంటిగ్రేటెడ్ వాటర్ పంప్, ఇంటర్నల్ వాటర్ కూల్డ్ సిస్టమ్‌ని అమర్చారు. 6 స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. అలాగే ఇందులో స్టెప్డ్ సీట్, ఇంటిగ్రేటెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో కూడా ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వంటివి అందించారు. ఈ బైక్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. ఫ్రంట్‌లో హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, 310 మిమీ వెంటిలేటెడ్ డిస్క్, డబుల్ పిస్టన్ కాలిపర్ బ్రేక్ వంటివి అమర్చారు.

అలాగే బ్యాక్ సైడ్.. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, 270 మిమి వెంటిలేటెడ్ డిస్క్, సింగిల్ పిస్టన్ కాలిపర్‌ను కలిగి ఉన్నాయి. Royal Enfield Guerrilla 450 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABSను అందించారు. ఈ ఫీచర్ మరింత సేఫ్టీని అందిస్తుంది. కాగా Royal Enfield Guerrilla 450 బైక్‌లో హైలైట్స్ ఏంటంటే.. రైడింగ్ మోడ్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే టెక్నాలజీ రైడ్ బై వైర్ టెక్నాలజీ, ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టం వంటివి అద్భుతమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.

Also Read: Best Bikes Under 1 Lakh: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్ బైక్స్.. వీటి మైలేజ్ సూపర్..!

ఇందులో ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్రిప్పర్ డాష్, 4 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ క్లస్టర్ వంటివి అందించారు. అలాగే Royal Enfield Guerrilla 450 బైక్‌ మొత్తం ఆరు కలర్ ఆప్షన్లతో ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయింది. అలాగే కంపెనీ ఈ బైక్‌పై పూర్తి స్థాయి వారంటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బైక్ బుకింగ్స్ భారత్‌లో కూడా ఓపెన్ అయ్యాయి. అయితే దీని ధర విషయానికొస్తే.. కంపెనీ ఈ Royal Enfield Guerrilla 450 బైక్‌ బేస్ అనలాగ్ వేరియంట్ దేశీయ మార్కెట్‌లో రూ.2.39 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరకు లాంచ్ చేసింది. అలాగే మిడ్ డాష్ వేరియంట్ రూ. 2.49 లక్షలు, టాప్ ఫ్లాష్ వేరియంట్ ధర రూ. 2.54 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×