BigTV English

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Hindenburg vs Adani: అదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్‌పర్సన్‌‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్

Hindenburg alleges SEBI chief Madhabi Buch linked to Adani offshore Entities: అదానీ గ్రూప్‌ కంపెనీలపై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్ పేల్చింది. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పూరీ బచ్, ఆమె భర్తకు అదానీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మారిసెస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలున్నాయంటూ హిండెన్‌బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో.. మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్ బర్గ్ ఆరోపణలతో మార్కెట్‌లో ఎలాంటి కుదుపు వస్తుందోనని భయపడుతున్నారు.


ఏడాదిన్నరగా అదానీ వర్సెస్ హిండెన్ బర్గ్ ఎపిసోడ్ నడుస్తోంది. 2023 జనవరి 23న కూడా హిండెన్‌బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని విమర్శించారు. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకొని మోసాలకు పాల్పడిందని గతేడాది హిండెన్ బర్గ్ ప్రధాన ఆరోపణ. కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని అప్పటో బాంబ్ పేల్చింది.

హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూశాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి గౌతమ్ అదానీ చాలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఫైనల్ గా మళ్లీ షేర్ విలువ పైకి వచ్చింది. హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి కీలక విషయాలను కూడా ప్రకటించింది. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.


Also Read: షాకిచ్చిన బంగారం.. మళ్లీ రూ.70 వేలు దాటేసిందిగా !

అంతేకాదు.. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం ఉందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో సెబీ చైర్మన్ కు షేర్లు ఉన్నాయని ప్రకటించింది. గతంలో తమ నివేదికపై సెబీ దర్యాప్తు చేయకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని హిండెన్ బర్గ్ ప్రధాన విమర్శ.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×