Abhinav Bindra| ఒలింపిక్స్ చరిత్రలో భారత దేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) ప్రతిష్టాత్మక ‘ఒలింపిక్ ఆర్డర్’ అవార్డుతో సన్మానం చేసింది. ‘ఒలింపిక్ ఆర్డర్’ అవార్డు ఒలింపిక్స్ లో అత్యుత్తుమ ఆటగాళ్లకు మాత్రమే గౌరవ చిహ్నంగా బహుకరిస్తారు. శనివారం పారిస్ లో ఒలింపిక్స్ కమిటీ అత్యుత్తమ ఒలింపిక్స్ ఆటగాళ్లకు అవార్డుల ప్రదానం చేసింది. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో అభినవ్ బింద్రా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో చాంపియన్ గా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించారు. భారత క్రీడా చరిత్రలో అది ఒక అరుదైన మైల్ స్టోన్ గా నిలిచిపోయే ఘటన.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
ఒలింపిక్ ఆర్డర్ అవార్డు బహుమానం సందర్భంగా అభినవ్ బింద్రా మాట్లాడుతూ.. ”నా బాల్యం నుంచి నేను ఒలింపిక్స్ రింగులు చూస్తూ పెరిగాను. ఒలింపిక్స్ లో విజయం సాధించాలనే కలను నిజం చేసుకోవాలని రెండు దశాబ్దాల పాటు కృషి చేశాను. ఇలాంటి అవార్డులు, సన్మానాలు మరింత శ్రమించేందుకు ప్రోత్సాహంలా పనిచేస్తాయి, నా రిటైర్మెంట్ తరవాత ఒలింపిక్స్ కోసం కష్టపడే వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ అవార్డు లభించడంతో నేను నా జీవితాంతం ఆ పని చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా వ్యక్తిగత మైల్ స్టోన్ మాత్రమే కాదు. ఏకాగ్రతతో క్రీడల్లో అత్యుత్తమ టార్గెట్ సాధించాలని తపనకు ఓ ప్రతీక. ఐఓసీ నా సన్మానం చేసినందుకు నా కృతజ్ఞతలు. నాకు లభించిన ఈ పురస్కారాన్ని ఒలింపిక్స్ కోసం తపించే ప్రతి ఆటగాడి డెడికేట్ చేస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
Also Read: పివి సింధు రికార్డ్ బ్రేక్.. ఒలింపిక్స్ లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అరుదైన ఫీట్!
షూటింగ్ ఆటలో 150కి పైగా వ్యక్తిగత పతకాలు సాధించిన అభినవ్ బింద్రా కెరీర్ లో ఇంటర్నేనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ తరపున షూటింగ్ లో అత్యుత్తమ పురస్కారమైన బ్లూ క్రాస్ అవార్డు 2018లో లభించింది. ఆయన రిటైర్మెంట్ తరువాత ఒలింపిక్స్ లో పాల్గొనాలనే కష్టపడుతున్న యువతకు అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నారు. వారికి అడ్వాన్సడ్ టెక్నాలజీ పరికరాలతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
India's first individual Olympic gold medalist, IOC Athletes' Commission Vice-Chair @Abhinav_Bindra has been bestowed with the prestigious Olympic Order, in recognition of his outstanding contribution to the Olympic Movement. pic.twitter.com/j0hbtCqAPy
— IOC MEDIA (@iocmedia) August 10, 2024