August 10,2024 Gold Price : కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఒక్కసారిగా రూ.3000 తగ్గిన బంగారం ధర.. ఆ తర్వాత పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. రెండ్రోజుల క్రితం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 63,500, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.69,270గా ఉండగా.. ఇప్పుడు మళ్లీ రూ.70 వేలు దాటేసింది.
పెళ్లిళ్ల సీజన్, వరలక్ష్మీవ్రతం వంటి పండుగలు కూడా ఉండటంతో.. బంగారం ధరలు నిన్నటి నుంచి షాకిస్తున్నాయి. తగ్గుతాయనుకుంటే.. ఊహించని రీతిలో రూ.1000 మేర పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,090గా ఉంది.
Also Read: పెళ్ళిళ్ల సీజన్ మొదలైంది.. మరి బంగారం ధరల మాటేంటి ?
ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.220 పెరిగింది. దీంతో ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,310 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.52,730గా ఉంది.
బంగారం మాదిరిగానే వెండి ధర కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్న కిలో వెండి ధరపై ఏకంగా రూ.1500 పెరిగి రూ.88,000 కు చేరుకుంది. నేడు కిలో వెండిపై రూ.100 మేర పెరగడంతో.. ప్రస్తుతం ధర రూ.88,100గా ఉంది. చూడబోతే మున్ముందు బంగారం, వెండి ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి బంగారం కొనాలంటే ఇప్పుడే త్వరపడండి.