E-Paper
Advertisement

Honda Elevate Price Down: బెస్ట్ ఆఫర్.. హోండా ఎలివేట్‌పై వేలల్లో డిస్కౌంట్!

Honda Elevate Price Down: బెస్ట్ ఆఫర్.. హోండా ఎలివేట్‌పై వేలల్లో డిస్కౌంట్!
Advertisement

Honda Elevate Price Down: కారు కొనడం అనేది ఒక డ్రీమ్. మనలో ప్రతి ఒక్కరు సొంత కారు ఉండాలని కోరుకుంటారు. అయితే మీరు ఇప్పుడు హ్యుందాయ్ క్రెటాకు పోటీగా కొత్త SUVని కొనుగోలు చేయాలని చూస్తుంటే మీకో శుభవార్త. ఎందుకంటే హ్యుందాయ్ క్రెటా ఎక్కువ మంది భారతీయులు కస్టమర్లు ఇష్టపడుతున్న మోస్ట్ పాపులర్ SUVలలో ఒకటి. హ్యుందాయ్ క్రెటా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ SUV.

హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతున్న హోండా ఎలివేట్ జూన్ నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఇప్పుడు హోండా ఎలివేట్‌ని కొనుగోలు చేస్తే రూ. 55,000 వరకు డబ్బును సేవ్ చేస్తారు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

Advertisement

Also Read: ఇండియాలో తోపు బైక్స్.. 75-90 కిమీ మైలేజ్ ఇస్తాయి!

హోండా ఎలివేట్ అనేది 5-సీటర్ కారు. దీని పవర్‌ట్రెయిన్‌గా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 121bhp పవర్‌ని 145Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కారు ఇంజన్‌లో కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటి ఆప్షన్ పొందుతారని కంపెనీ వెల్లడించింది. హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 15.31 కిమీ మైలేజీని ఇస్తుంది. అయితే ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 16.92 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

హోండా ఎలివేట్‌లో LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, R16 స్టీల్ వీల్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్‌లు ఉంటాయి. డ్రైవర్ సీటు ఎత్తు అడ్జెస్ట్‌మెంట్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ బ్యాక్ స్ప్లిట్ సీట్లు ఉన్నాయి.

Also Read: 360 డిగ్రీ కెమెరా అందించే బడ్జెట్ కార్లు ఇవే!

హోండా ఎలివేటర్ కారు క్యాబిన్‌లో కొనుగోలుదారులు ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది కాకుండా సేఫ్టీ కోసం SUV 6-ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాక్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లతో కూడా ఉన్నాయి. హోండా ఎలివేట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 11.91 లక్షల నుండి రూ. 16.5 లక్షల వరకు ఉంటుంది.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×