BigTV English

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్

PM Modi: బిజీ బిజీగా ప్రధాని మోదీ..100 రోజుల అజెండాపై ఫోకస్

PM Modi: లోక్ సభ ఎన్నికలు, కన్యాకుమారి పర్యటన తర్వాత ప్రధాని మోదీ తిరిగి అధికారిక సమావేశాలతో ఆదివారం బిజీ బిజీగా గడపనున్నారు. మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు సహా.. దేశంలోని హీట్ వేవ్ పరిస్థితులపై మోదీ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.


లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1న ముగిసింది. అయితే పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం పలు న్యూస్ చానళ్లు, వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. వాటిలో దాదాపు అన్ని సర్వేలు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఆదివారం మోదీ చేపట్టనున్న సమావేశాల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేయాల్సిన పనులపై నేతలతో చర్చలు జరపనున్నారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాగా.. ఈ నేపథ్యంలో జరిగే వార్షిక ఈవెంట్ సెలబ్రేషన్స్ గురించిన పలు నిర్ణయాలను మోదీ తీసుకోనున్నట్లు సమాచారం.భూమి పునరుద్ధరణ, డిసెర్టిఫికేషన్, కరువు థీమ్ తో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగనుంది. ఈవెంట్ కు సంబంధించిన పలు ఏర్పాట్లపై మోదీ చర్చించనున్నట్లు సమాచారం.


Also Read:  ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ కామెంట్స్, అది మోదీ మీడియా పోల్..

ఈ విధంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందు సీనియర్ నేతలతో మోదీ చర్చించారు. మోదీ 3.0కు సిద్ధంగా ఉండాలని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకు తగ్గట్టుగా సన్నద్దంగా ఉండాలని సూచించారు. ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×