BigTV English

Top 5 Mileage Bikes In India: ఇండియాలో తోపు బైక్స్.. 75-90 కిమీ మైలేజ్ ఇస్తాయి!

Top 5 Mileage Bikes In India: ఇండియాలో తోపు బైక్స్.. 75-90 కిమీ మైలేజ్ ఇస్తాయి!

Top 5 Mileage Bikes In India: దేశంలో టూవీలర్ల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి చిన్న అవసరాలకు కూడా బయటకు వెళ్లడానికి బైకులను ఉపయోగిస్తున్నారు. టూవీలర్ కంపెనీలు సైతం మంచి ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌లో వాహనాలను అందిస్తున్నాయి. మీరు కూడా భవిష్యత్తులో బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించింది.


ఇందులో హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు బైకులను అందిస్తున్నాయి. మీరు టాప్ మైలేజీతో బడ్జెట్ ఫ్రెండ్లీ టూ వీలర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 5 బెస్ట్ మైలేజీ ఇచ్చే బైకులు ఉన్నాయి. లీటరుకు 90 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తాయి. ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ టూవీలర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: కవాసకి నింజా నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్.. 400 సీసీతో దుమ్ములేపుతుంది!


Hero HF 100
Hero HF 100 అనేది భారతదేశంలో సేల్ చేయబడుతున్న అత్యంత సరసమైన బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,018. ఇది 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8bhp పవర్, 8.05Nm టాప్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ సుమారుగా 70 kmpl మైలేజీని ఇస్తుంది.

TVS Sport
TVS స్పోర్ట్ భారతదేశంలో అత్యంత చీపెస్ట్ బైకుల్లో ఒకటి, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,881. ఈ బైక్‌లో 109.7సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ మోటార్‌సైకిల్ 75 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.

TVS Radeon
TVS రేడియన్ 110cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది హైవేపై 69 kmpl, సిటీ రైడ్‌లో 74 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ 8.19బిహెచ్‌పి పవర్, 8.7ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.62,630.

Honda Shine 100
హోండా షైన్ 100 98.98cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో 7.38bhp పవర్, 8.05Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.హోండా షైన్ 100 ఎక్స్-షోరూమ్ ధర రూ.64,900. ఈ బైక్ లీటరుకు 67 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: 360 డిగ్రీ కెమెరా అందించే బడ్జెట్ కార్లు ఇవే!

Bajaj Platina 100
భారతీయ మార్కెట్‌లో బజాజ్ అత్యంత చౌకైన బైక్ బజాజ్ ప్లాటినా 100. బజాజ్ ప్లాటినా 100లో 102cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7.9bhp, 8.3Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,808. బజాజ్ ప్లాటినా 100 లీటరుకు 75 నుండి 90 కిమీ మైలేజీని ఇస్తుంది.

Tags

Related News

Jio Anniversary Offer: కేవలం రూ.100కే ఆల్ ఇన్ వన్ జియో ఆఫర్.. గిఫ్టులు, డిస్కౌంట్లు అన్నీ ఒకే ప్యాకేజీ!

Gold Rate Dropped: అబ్బా చల్లని కబురు.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Rental Areas in Hyderabad: హైదరాబాద్ లో అద్దె ఇల్లు కావాలా? ఏ ఏరియాల్లో రెంట్ తక్కువ అంటే?

EPFO Atm Withdrawal: ఈపీఎఫ్ఓ నుంచి మరో బిగ్ అప్డేట్.. త్వరలో ఏటీఎం తరహాలో నగదు విత్ డ్రా!

Maruti Suzuki – GST: ఓ వైపు దసరా సేల్స్, మరోవైపు జీఎస్టీ తగ్గింపు.. అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి!

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

Big Stories

×