Big Stories

Crop Residues: పంట వ్యర్థాలతో రూ.66.5 కోట్ల టర్నోవర్!

Biofuels Junction Pvt Ltd

Biofuels Junction Pvt Ltd: పంట వ్యర్థాల నిర్వహణ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.3,333 కోట్లు వెచ్చించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల వాయుకాలుష్యం పెరగడానికి కారణం పంట వ్యర్థాలను రైతులు తగలబెడుతుండటం ఒకటి. అంతిమంగా ఇది పర్యారణ సమస్యకు దారితీస్తోంది.

- Advertisement -

పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుడు పంట వ్యర్థాలను తగులబెట్టిన ఘటనలు 42,962 చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అటు పర్యావరణ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పంట వ్యర్థాలను అర్థవంతంగా వినియోగించడం ఎలా? అశ్విన్ పాటిల్, చైతన్య కర్గోంగర్ ద్వయానికి ఇదే ప్రశ్న ఉదయించింది. వారి ఆలోచనల నుంచి పుట్టిందే బయోఫ్యూయల్స్ జంక్షన్.

- Advertisement -

ఐదేళ్ల కృషి ఫలితంగా ఇప్పుడా స్టార్టప్ రూ.66.5కోట్ల కంపెనీగా ఎదిగింది. ఈక్విటీ మార్కెట్ ఎనలిస్ట్‌గా అశ్విన్‌కు 17 ఏళ్ల అనుభవం ఉంది. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ఆరంభించాలని అనుకున్నాడు. పుట్టింది వ్యావసాయిక కుటుంబంలోనే
అయినా.. సేద్యరంగం గురించి అణు మాత్రం తెలియదు.

Read more: కొలువును కాలదన్ని.. ఇడ్లీల వ్యాపారంలోకి..

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల గురించి ఏడాది పాటు అధ్యయనం చేశాడు. ఇందులో భాగంగా 2017లో దేశమంతటా పర్యటిస్తూ రైతులను కలుసుకున్నాడు. వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నాడు. పంట వ్యర్థాల తొలగింపు రైతులకో
సమస్యగా మారిందని అర్థమైంది. పత్తి వంటి వాణిజ్య పంటల విషయంలో వ్యర్థాలు మరీ ఎక్కువ.

వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు ఏవీ లేకపోవడంతో చేసేది లేక రైతులు వాటిని తగలబెట్టడం ఓ అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా
పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వరి పంట వేసిన అనంతరం మిగిలే వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుండటంతో కొత్త సమస్యలకు దారి తీసింది. దాని వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో పంట వ్యర్థాలను బయోఫ్యూయల్‌గా మార్చగలిగితే లాభసాటి కాగలదనే నిర్ణయానికి వచ్చాడు అశ్విన్. దానిని బ్రికెట్స్, పెల్లెట్లుగా మార్చి పరిశ్రమల్లోని
బాయిలర్లలో డీజిల్, బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించవచ్చనే ఆలోచన
కలిగింది.

2018లో చైతన్యతో కలిసి బయోఫ్యూయల్స్ జంక్షన్ నెలకొల్పాడు. రైతుల నుంచి అగ్రివేస్ట్ ను సేకరించి, ప్రాసెస్ చేసి ఘన జీవ ఇంధనంగా చేయడం ఈ ప్రాజెక్టు
లక్ష్యం. తమ సేవింగ్స్ నుంచి రూ.7 కోట్లను తీసి పెట్టుబడిగా పెట్టారు అశ్విన్,
చైతన్య. 2019 నుంచి ఆ కంపెనీ లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. అనంతరం నాలుగేళ్లలోనే టర్నోవర్ పదింతలైంది. నిరుడు బయోఫ్యూయల్స్ జంక్షన్ టర్నోవర్ రూ.66.5 కోట్లకు చేరింది.

ఎలాంటి బైండింగ్ ఏజెంట్ అవసరం లేకుండానే అగ్రిలకల్చరల్, వుడ్ వేస్ట్‌ను సాలిడ్ బయోఫ్యూయల్స్‌ ను తయారు చేస్తున్నారు. భారత్‌లో ఏటా 500 మిలియన్ టన్నుల మేర అగ్రివేస్ట్ ఉత్పత్తి అవుతోంది. దీనిలో 200 మిలియన్ టన్నులను తగులబెడుతున్నారు.

ఈ వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురాగలిగితే రూ.50 వేల కోట్ల విలువైన బిజినెస్‌ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా. అయితే బయోఫ్యూయల్స్ వినియోగం పరిమితంగా ఉండటానికి ప్రధాన కారణం.. నాణ్యతను ఒకేలాపాటించకపోవడం. దాంతో పాటు నిరంతర సరఫరా లోపించడం మరొక కారణమని అశ్విన్ వివరించాడు. అయితే నాణ్యతా ప్రమాణాల విషయంలో తాము రాజీ
పడటం లేదని చెప్పాడు.

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మరో 450 మంది బయోఫ్యూయల్ తయారీదారులతో కలిసి అశ్విన్ సంస్థ పనిచేస్తోంది.
పంట వ్యర్థాల కోసం రైతులకు కొంత మొత్తం చెల్లిస్తున్నారు. రైతులకు ఎకరానికి రూ.600-1000 వరకు చెల్లిస్తారు. నిరుడు ఇలా 25 వేల మంది రైతుల నుంచి పంట
వ్యర్థాలను సేకరించగలిగారు.

వాస్తవానికి అశ్విన్ సంస్థ తయారుచేస్తున్న బయోఫ్యూయల్ చాలా చౌక. ఇండొనేసియా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరతో పోలిస్తే పదిశాతం తక్కువగానే
లభ్యమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News