Actress Girija: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల లిస్టు తీస్తే అందులో గీతాంజలి (Geethanjali) సినిమా ముందు వరుసలో ఉంటుంది. మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిన చెప్పాల్సిన పనిలేదు. గీతాంజలి సినిమాలో నాగార్జునకు జోడిగా నటి గిరిజా శెట్టార్(Girija Shettaar) నటించి సందడి చేశారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ గిరిజ తదుపరి సినిమాలలో పెద్దగా కనిపించలేదని చెప్పాలి. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు.
నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ..
ఇకపోతే తాజాగా గిరిజకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటుడు జగపతిబాబు హోస్టుగా వ్యవహరించిన కార్యక్రమంలో భాగంగా ఈమె కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజ నటుడు నాగార్జున గురించి అలాగే గీతాంజలి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.” గీతాంజలి సినిమా నాకు తొలి తెలుగు సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.. ఎంతో సౌమ్యుడు లెజెండ్ కు నాగార్జున ఏమాత్రం తీసుపోరని, అలాంటి ఒక గొప్ప వ్యక్తి నా మొదటి సినిమాకు సహనటుడిగా ఉన్నందుకు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
మెడిటేషన్ క్లాస్ లను నిర్వహిస్తున్న నటి…
ఇలా గిరిజ గీతాంజలి సినిమా గురించి నాగార్జున గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో అభిమానులు ఎంతో షాక్ అవుతున్నారు. అసలు తనకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? అందుకే ఇలా మారిపోయారా? అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో గీతాంజలితో పాటు హృదయాంజలి అనే సినిమా చేశారు. అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం గిరిజ “లా గ్రేస్ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ లైఫ్ సెంటర్” పేరుతో మెడిటేషన్ క్లాస్ లను నిర్వహిస్తూ ఉన్నారు.
గీతాంజలి ఎవర్ గ్రీన్ మూవీ…
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గిరిజ ఇండస్ట్రీకి దూరం అవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.గీతాంజలి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో ఎమోషన్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమాలోని లవ్ ట్రాక్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా. గిరిజ గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఒకసారిగా ఈ షోలో కనిపించడంతో ఆమె లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
Also Read: Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!