Big Stories

HanuMan New Record: ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. చాలా ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..!

Hanuman movie records

HanuMan Movie Running in 300 centers from 30 Days: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది. అలాగే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

- Advertisement -

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అదిరిపోయే టాక్‌తో పొంగల్ విన్నర్‌గా నిలిచింది. ఇక రిలీజ్ సమయంలో సరైన థియేటర్లు లేక ఎన్నో ఇబ్బందులను ‘హనుమాన్’ టీం ఎదుర్కొంది. ఆ కష్టా నష్టాలను ఓర్చుకొని చివరికి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది.

- Advertisement -

అంతేకాకుండా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా తెలుగు సినీ చరిత్రలో మరో సెన్సేషనల్ రికార్డును హనుమాన్ మూవీ నమోదు చేసింది. సంక్రాంతి పోటీలోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీని వెనక్కి నెట్టేసింది.

READ MORE: HanuMan: రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘హనుమాన్’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు

ఇక మొదటి రోజు నుంచే బాక్సాఫీసు వద్ద ప్రారంభమైన హనుమాన్ మూవీ దూకుడు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్, రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.

అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమెరికా బాక్సాఫీసు వద్ద 5మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి టాప్ 5లో నిలిచింది. తాజాగా ఈ మూవీ మరో అద్భుతమైన మార్క్‌ను అందుకుంది. ఈ సినిమా దాదాపు బాక్సాఫీసు వద్ద 30 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. అదికూడా.. 300 సెంటర్స్‌లో ఈ సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ అందుకోవడం గమనార్హం అనే చెప్పాలి.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.152 కోట్ల షేర్ (రూ.300 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ పేరిట.. మరో రూ.50 కోట్ల అదనపు లాభాలతో నిర్మాతల పంట పండించింది.

READ MORE: Teja Sajja about HanuMan: హనుమాన్ సినిమా కోసం 75 సినిమాల్ని వదులుకున్నాను: తేజ సజ్జ

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే రిలీజై ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. త్వరలో మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆయా భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ఈ మూవీ యూనిట్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News