DMart: అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ నడిపిస్తున్న డిమార్ట్ గురించి ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారులకు ఇదే బెస్ట్ డెస్టినేషన్ గా చెప్పుకోవచ్చు. కిరాణా సామాన్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిదీ MRP కంటే తక్కువ ధరలకే లభిస్తాయి. డిమార్ట్ లో తక్కువ ధరలకే వస్తువులు లభించినా, ఇంకా కొన్ని టిప్స్ పాటిస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఏ టైమ్ లో ఎక్కవ డిస్కౌంట్ లభిస్తుందంటే?
డిమార్ట్ లో కొన్ని రోజుల్లో ప్రత్యేక ప్రమోషన్లను అందిస్తుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వీక్లీ అమ్మకాల మీద ఆఫర్లు అందిస్తుంది. కిరాణా సామన్లు, దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, గృహ అవసరాలపై మంచి తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఈ టైమ్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్లు, గణనీయమైన తగ్గింపులను అందిస్తుంది. వీకెండ్ లో మిగిలిపోయిన స్టాక్ ను క్లియర్ చేయడానికి కొన్ని డిమార్ట్ స్టోర్లు సోమవారం క్లీన్-అప్ అమ్మకాలు నిర్వహిస్తాయి. ఈ అమ్మకాలు ఇప్పటికే తగ్గించబడిన వస్తువులపై అదనపు తగ్గింపులను కలిగి ఉంటాయి. ఇక దీపావళి, హోలీ, నూతన సంవత్సరం వంటి ప్రధాన పండుగల సమయంలో డిమార్ట్ భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.
⦿ ప్రత్యేకమైన డీల్స్ కోసం డిమార్ట్ రెడీ
డిమార్ట్ రెడీ యాప్ ఆన్ లైన్ లో ప్రత్యేకమైన డిస్కౌంట్లు, కూపన్లను అందిస్తుంది. ఇవి తరచుగా సోమవారాలు, బుధవారాల్లో అందుబాటులో ఉంటాయి. ఈ డీల్స్ ఆన్ లైన్ ఆర్డర్లకు మాత్రమే చెల్లుతాయి. కిరాణా, ఎలక్ట్రానిక్స్, మరిన్నింటిపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లను అందిస్తాయి.
⦿ పెద్దమొత్తంలో కొనండి!
డిమార్ట్ లో బల్క్ కొనుగోలు ఎంపికలు పొదుపు కోసం ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బియ్యం, పప్పులు, వంట నూనె, ఇళ్లు శుభ్రపరిచే సామాగ్రిపై ఎక్కువ ఆఫర్లు లభిస్తాయి. 25 కిలోల బియ్యం సంచి సాధారణంగా 5 కిలోల సంచి కంటే కిలోకు చౌకగా ఉంటుంది.
⦿ డిమార్ట్ ఇన్ హౌస్ బ్రాండ్లను ఎంచుకోండి!
సబ్బులు, డిటర్జెంట్లు, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి డిమార్ట్ ఉత్పత్తులు, పాపులర్ బ్రాండ్లతో పోల్చితే తక్కువ ధరలకే లభిస్తాయి. ప్రసిద్ధ బ్రాండెడ్ వస్తువుల కంటే వీటిని ఎంచుకోవడం వల్ల తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది. అదనపు ఖర్చులను తగ్గిస్తాయి.
⦿ క్లియరెన్స్ విభాగంలో డిస్కౌంట్లు
డిమార్ట్ తరచుగా వాటి గడువు తేదీకి దగ్గరగా ఉన్న ఉత్పత్తుల కోసం ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంటుంది. బై వన్ గెట్ వన్ తో పాటు ఎక్కువ తగ్గింపులు, బండిల్ డీల్స్ ను అందిస్తుంది. ఒకవేళ వీటిని వెంటనే ఉపయోగించుకోవాలనుకుంటే వీటిని తీసుకోవచ్చు.
⦿ షాపింగ్ లిస్టును ముందే ప్రిపేర్ చేసుకోండి
డిమార్ట్ షాపింగ్ కు వెళ్లే సమయంలో ముందుగానే షాపింగ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అనవసరమైన కొనుగోళ్లను తగ్గిస్తుంది. బడ్జెట్ కు లోబడి షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. డబ్బును ఆదా చేస్తుంది.
⦿ వీక్లీ ఆఫర్లను తనిఖీ చేయండి
డిమార్ట్ డిస్కౌంట్లను స్టోర్ లోని ఫ్లైయర్లు, దాని వెబ్ సైట్, డిమార్ట్ రెడీ యాప్ ద్వారా ఆఫర్లను చెక్ చేయాలి. షాపింగ్ చేయడానికి ముందు, ప్రస్తుత ప్రమోషన్లను గుర్తించడానికి వీటిని గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా గృహ ఉపకరణాలు, బల్క్ కిరాణా లాంటి విలువైన వస్తువులపై ఎక్కువ డిస్కౌంట్ ను పొందవచ్చు.
⦿ తెలివిగా షాపింగ్ చేయడానికి సరైన టైమ్
వారాంతాలు, నెల ప్రారంభంలో డిమార్ట్ అత్యంత రద్దీ సమయాలు. ఈ సమయంలో డీల్స్ ను గుర్తించడం కష్టం అవుతుంది. సోమవారం, మంగళవారం రోజు స్టోర్ కు వెళ్లడం వల్ల సులభంగా షాపింగ్ చేసుకోవచ్చు. డీల్స్ ను కూడా గమనించవచ్చు.
⦿ క్యాష్ బ్యాక్ యాప్ లు, లాయల్టీ ప్రోగ్రామ్ లను ఉపయోగించండి
డిమార్ట్ కి సాంప్రదాయ లాయల్టీ ప్రోగ్రామ్ లేనప్పటికీ, కిరాణా కొనుగోళ్లపై రిబేట్లను అందించే క్యాష్ బ్యాక్ యాప్ లతో జత చేయవచ్చు. మీ ఖర్చులో కొంత భాగాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సో, ఇకపై ఈ చిట్కాలు ఉపయోగించి చక్కటి ఆఫర్లను పొందే ప్రయత్నం చేయండి.
Read Also: డి-మార్ట్ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?