BigTV English

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

ప్రస్తుత కాలంలో ఒక ఇల్లు కొనాలన్నా, లేక కారు కొనాలన్నా తప్పనిసరిగా లోన్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఈ ఫాస్ట్ యుగంలో మీరు డబ్బులు పొదుపు చేసి ఆ పొదుపు చేసిన డబ్బుతో మీ అవసరాలను తీర్చుకోవాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రకరకాల లోన్ ప్లాన్స్ అమల్లోకి తెస్తున్నాయి. వీటిలో ఇంటిలోన్, కారులోన్, టూ వీలర్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఇలా వేటికవే ప్రత్యేకమని చెప్పవచ్చు. మీ చెల్లింపు చరిత్ర ఎంత బాగుంటే మీకు క్రెడిట్ స్కోర్ అంత బాగా పెరుగుతుంది. అయితే ఈ లోన్ ప్రక్రియలో మీరు ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ క్లియర్ చేసుకోవడం అనేది తప్పనిసరి. మీ క్రెడిట్ క్లియర్ అయినప్పుడల్లా తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా వెంటనే బ్యాంకుకు వెళ్లి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకోవడం అనేది తప్పనిసరి. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక వెహికల్ లోన్ తీసుకున్నట్లయితే, ఆ లోన్ పూర్తయిన వెంటనే నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకొని, దాంతో మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మార్పించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ట్రాఫిక్ చలానాలు సైతం పడే అవకాశం ఉంటుంది. అందుకే నో డ్యూ సర్టిఫికెట్ అంత కీలకమని చెప్పవచ్చు. ప్రస్తుతం మీరు లోన్ పూర్తి చేసిన వెంటనే బ్యాంకు నుంచి పొందాల్సిన డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.


రుణం తీరిన వెంటనే తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవే
1. నో డ్యూ సర్టిఫికెట్ : మీరు రుణం చెల్లించిన వెంటనే బ్యాంకు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. లేకపోతే మీరు పూర్తిగా రుణం చెల్లించినప్పటికీ మీ లోన్ ఖాతా మూయకుండా ఆపరేటింగ్ లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు పొరపాట్లు చేస్తుంటాయి. తద్వారా మీరు భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని మీరు చివరి నెల ఈఎంఐ చెల్లించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అప్పుడు మీ లోన్ ఖాతా అనేది క్లోజ్ అవుతుంది. తద్వారా మీరు రుణ విముక్తులు అవుతారు.

2. ఆస్తి పత్రాలు వెనక్కి తీసుకోవడం: మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే మీరు చివరి నెల వాయిదా చెల్లించిన వెంటనే బ్యాంకుకు వెళ్లి మీ ఇంటి పత్రాలు అన్నీ కూడా సరిచూసుకొని వెనక్కు తెచ్చుకోవాల్సి ఉంటుంది.


3. తాకట్టు తొలగించుకోవాలి: ఒకవేళ మీరు ఆస్తులను తాకట్టు పెట్టి రుణం పొందినట్లయితే, ఆ రుణం తీరిన వెంటనే లియెన్ (Lien) రీమువల్ రిక్వెస్ట్ పెట్టుకొని, మీ ఆస్తిపై తాకట్టును తొలగించుకోవాలి. బ్యాంకు నుంచి ఈ లేఖను పొందిన వెంటనే, ఆ లేఖను తీసుకొని వెళ్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో, మీ ఆస్తి తాకట్టులో లేదన్న సంగతి నమోదు చేయించాలి. లేకపోతే రిజిస్ట్రార్ డాక్యుమెంట్లలో మీ ఆస్తి ఇంకా తాకట్టు లోనే ఉన్నట్లు నమోదయి ఉంటుంది. దీని వల్ల మీరు భవిష్యత్తులో మరోసారి లోన్ పొందాలన్నా, ఎవరికైనా విక్రయించాలన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Related News

Jio recharge plans 2025: ఓర్నీ.. జియోలో ఇన్ని రీఛార్జ్ ఆఫర్లు ఉన్నాయా? బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి

Gold Price: దసరా పండుగకు బంగారం లక్షన్నర దాటేస్తుందా..?

October Bank Holidays: అక్టోబర్‌లో 21 రోజుల బ్యాంక్ హాలిడేలు.. పూర్తి లిస్ట్ ఇదిగో!

New Rules from October 1: పలు రంగాల్లో ఆర్థిక లావాదేవీలు.. అక్టోబర్ ఒకటి నుంచి కీలక మార్పులు

TCS Layoffs: ఆందోళనలో TCS ఉద్యోగులు, ఏకంగా 30 వేల ఉద్యోగాలు అవుట్!

Hostels History: హాస్టల్ అనే పదం ఎవరు కనిపెట్టారు? లేడీస్, బాయ్స్ హాస్టల్స్ ఎందుకు వేరు చేశారు?

Realty Sector: ఒక్కో ఫ్లాట్ 100 నుంచి Rs. 500 కోట్లు.. అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు, ఏయే ప్రాంతాల్లో

Patanjali Electric Cycle: పతంజలి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. 300కిమీ రేంజ్‌లో టాప్ స్పీడ్!

Big Stories

×