BigTV English

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

బంగారం ధర అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకొని వెళుతోంది. ముఖ్యంగా పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకడానికి ప్రధానంగా ప్రపంచ వాణిజ్య రంగంలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో వాణిజ్య నిర్బంధం పాటిస్తున్నారు. దీంతో అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కూడా ఈ పరిణామాలతో నష్టాల బారిన పడుతున్నాయి. ఈ నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి బయటకు తీసి సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు.


బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పసిడిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు చూడవచ్చు. గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధర అటు అమెరికా మార్కెట్లో గమనించినట్లయితే ఒక ఔన్స్ బంగారం ధర 3400 డాలర్లు దాటి ముందుకు దూసుకొని వెళ్ళింది. పసిడి ధర ఈ రేంజ్ లో పెరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు ఇప్పటికే టెక్నికల్ గా చూసినట్లయితే ఓవర్ బాట్ పొజిషన్ చేరుకున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ నుంచి బంగారం ధర భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు లేదా స్థిరంగా కొంతకాలం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు.

అయితే విచిత్రంగా బంగారంతో పాటు వెండి ధర కూడా ఆల్ టైం రికార్డులను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుని వెళ్తోంది. వెండి ధర గత సంవత్సరం తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు పెరిగింది. ప్రస్తుతం వెండి ధర ఒక కేజీ 1.25 లక్షల రూపాయలు ఉందంటే ఆశ్చర్యం కలగక మారదు. అయితే వెండి ధర ఇంత భారీగా పెరగడానికి ప్రధానంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక కారణం అని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి బంగారం ఎక్కువగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండదు. . అంటే పరిశ్రమల్లో బంగారాన్ని ఉపయోగించరు.


అదే సమయంలో వెండిని పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తుంటారు, ఉదాహరణకు ఎలక్ట్రికల్ వాహనాల తయారీలోనూ, ఎలక్ట్రికల్ వస్తువుల తయారీలోనూ, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలోనూ, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. భవిష్యత్తులో వెండి డిమాండ్ పెరగడానికి ఎలక్ట్రికల్ వాహనాల ఉత్పత్తి పెరగడమే ఒక కారణంగా చెప్పవచ్చు. దీంతో భవిష్యత్తులో వెండి మరో బంగారం అవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాసిన రాబర్ట్ టి. కియోసాకి పేర్కొన్నారు. భవిష్యత్తులో వెండి కి డిమాండ్ అమాంతం పెరిగే అవకాశం ఉందని, వెండిలో పెట్టుబడి పెట్టాలని తద్వారా మీ పెట్టుబడి సేఫ్ అవుతుందని సూచిస్తున్నారు.

Disclaimer: బిగ్ టీవీ తెలుగు వెబ్ పోర్టల్ ఎటువంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మేము మీ పెట్టుబడులకు బాధ్యత వహించము. పైన ఇచ్చిన సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. దయచేసి దీన్ని ఒక విద్యా విషయంగా మాత్రమే పరిగణించండి.

Related News

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

ఇకపై టోల్ గేట్ అడ్డంకులు లేవు…నేటి నుంచి ఫాస్టాగ్ పాస్ అమలు..ఇలా రీచార్జ్ చేయించుకోండి..

Scheme for women: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ – వడ్డీ లేకుండా 5 లక్షల రుణం

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం

Big Stories

×