E-Paper
Advertisement

RS 2000 Notes Deposit: మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా?.. అయితే ఇలా సింపుల్ గా మార్చుకోవచ్చు

RS 2000 Notes Deposit: మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు ఉన్నాయా?.. అయితే ఇలా సింపుల్ గా మార్చుకోవచ్చు
Advertisement

RS 2000 Notes Deposit: మీ దగ్గర ఇంకా రూ. 2,000 నోట్లు ఉన్నాయా? ఇప్పుడు వాటిని మార్చుకోవచ్చా? అయితే మీ సమాచారం మీ కోసమే. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆర్థిక మార్పుల నేపథ్యంలో… 2రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2,000 కరెన్సీ నోట్లపై కీలక అప్డేట్ ఇచ్చింది. రూ.2000 నోట్లను రద్దు చేసిన మూడేళ్ల తరువాత కూడా… అధికారిక డేటా ప్రకారం కొద్ది శాతం నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయని తెలిపింది.

ఇంకా తిరిగి రాని రూ.5669 కోట్లు

ఆర్బీఐ ఇటీవల రూ.2000 నోట్లకు సంబంధించి ఒక బులెటిన్ విడుదల చేసింది. రూ.2000 నోట్ల రద్దు ప్రకటించిన తేదీ మే 19, 2023 నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. అయితే డిసెంబర్ 31, 2025న నాటికి వీటి చలామణి రూ.5,669 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. అంటే మొత్తం రూ.2000 నోట్లలో 98 శాతానికి పైగా కేంద్ర బ్యాంకుకు తిరిగి వచ్చాయి. అయితే, కొద్ది సంఖ్యలో నోట్లు ఇప్పటికీ చలామణిలో లేదా వ్యక్తుల వద్ద ఉన్నాయని ధృవీకరించింది.

Advertisement

అయితే బ్యాంకులకు తిరిగి రాని రూ.2000 నోట్లు రద్దు చేసినప్పటికీ.. ఇప్పటికీ చట్టబద్ధమైన చెల్లుబాటులోనే ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాబట్టి తమ వద్ద రూ. 2000 నోటు ఉంటే, అది నేరం కాదని, ఆ నోటును ఆర్బీఐకి తిరిగి అప్పగించాలని సూచించింది.

పోస్టులో కూడా పంపొచ్చు

బ్యాంకుల్లో ఈ సదుపాయం అందుబాటులో లేదు.రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి అక్టోబర్ 7, 2023తో గడువు ముగిసింది. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఆర్బీఐ కార్యాలయాలలో డిపాజిట్ చేయవచ్చు. అక్టోబర్ 9, 2023 నుండి ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాలలో ఈ నోట్లను.. వ్యక్తులు లేదా సంస్థల బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చు. అలాగే ఆర్బీఐ కార్యాలయాలలో నేరుగా నోట్లను మార్చుకోవచ్చు. ఒకవేళ దూరప్రాంతాల్లో ఉంటే పోస్ట్ ద్వారా ఆయా ఆర్బీఐ కార్యాలయాలకు పంపవచ్చు.

Advertisement

Also Read: జనవరి 2026లో 10 రోజులు బ్యాంకు సెలవులు.. ఆర్బీఐ షెడ్యూల్ ఇదే

ఆర్బీఐ నోట్ల జారీ కేంద్రాలు ఇక్కడే

దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా పోస్టాఫీసు ద్వారా రూ. 2000 నోట్లను ఆర్బీఐ జారీ కార్యాలయానికి పంపవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ నోట్ల జారీ కేంద్రాలు ఉన్నాయి.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×