E-Paper
Advertisement

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

జాన్వీ కపూర్ లుక్ అదిరిందిగా.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Janhvi Kapoor:రీసెంట్ గా పెద్ది సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం లగ్ జ గాలే మరియు రాక సినిమాలలో నటిస్తూ మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపొయింది. ఇక ఇపుడు సినిమాలతోనే కాదు తనదైన పోస్ట్ లతో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌

ఈ క్రమంలోనే ఇంస్టాలో జాన్వీ కపూర్ షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రంగురంగుల ఎంబ్రాయిడరీతో ఉన్న లెహంగా తరహా దుస్తుల్లో జాన్వీ ఇచ్చిన పోజులు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్‌లోని కలర్ కాంబినేషన్, డిజైనింగ్, ఆభరణాలు జాన్వీని మరో అతిలోక సుందరిగా మార్చేశాయి.

వినాయక చవితి వేడుకల్లో దర్శనం

Advertisement

ఇక ఈ మధ్య అంబానీ కుటుంబంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో జాన్వీ ఈ డ్రెస్ లో దర్శనం ఇచ్చినట్టు తెలుస్తుంది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫొటోల్లో డ్రెస్ కన్నా ముందు ఆమె వేసుకున్న జ్యువెలరీ, చెవులకు పొడవాటి జుంకాలు, నుదుటిపై మాథా పట్టీ, చేతులకు వరుసగా గాజులు, స్టేట్‌మెంట్ రింగ్స్‌తో ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది. సాధారణంగా సాంప్రదాయంగా వేసిన డ్రెస్ లకి భారీగా ఆభరణాలు ధరిస్తుంటారు. కానీ జాన్వీ మాత్రం డ్రెస్‌లోని రంగులని మ్యాచ్ చేస్తూ సింపుల్ గా జ్యువెలరీని వేసుకోవడం విశేషం.

కెరీర్ విషయానికి వస్తే

జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘మిలీ’, ‘మిస్టర్ & మిసెస్ మహి’, ‘ఉలజ్’, ‘పరమ్ సుందరి’, ‘హోమ్‌బౌండ్’, ‘సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి’ వంటి పలు మంచి సినిమాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.అలాగే క్రమంగా సౌత్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెంచేసింది.అలా దేవర సినిమాలో తంగం పాత్రతో పలకరించి ,రీసెంట్ గా పెద్ది సినిమాలో అచ్చియమ్మగా అదరగొట్టి సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్  అందాల ఆరబోతపై విమర్శలు చెలరేగిన సంగతి తెల్సిందే.

సినిమాల సంగతి పక్కన పెడితే

Advertisement

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్ లతో రచ్చ చేస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. అలా ఒకసారి గ్లామరస్ ఫ్యాషన్‌లో కనిపిస్తే.. మరోసారి చీరలో సంప్రదాయంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.ముఖ్యంగా పండుగలు, ఫ్యామిలీ ఈవెంట్స్, ఫ్యాషన్ ఫొటోషూట్స్ సమయంలో జాన్వీ ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌పై తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

ALSO READ:ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

మొత్తానికి సినిమాలతో ఒకవైపు బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో తన స్టైల్ స్టేట్‌మెంట్స్‌తో మరోవైపు జాన్వీ కపూర్ సందడి చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఈ ట్రెడిషనల్ ఫొటోలకి తమ అభిప్రాయాలని తెలుపుతూ లైక్స్, కామెంట్స్‌ వర్షం కురిపిస్తున్నారు జాన్వీ ఫ్యాన్స్

Tags

Related News

ఏష నాగుల పాటకి కీర్తి సురేష్ రెమ్యునరేషన్.. వామ్మో అంత తీసుకుందా?

నటుడు అనంత్ నాగ్ కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం!

సెన్సార్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. రన్ టైం ఎంతంటే?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×