E-Paper
Advertisement

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా
Advertisement

Korean Action Historical action Drama : ఒకవైపు యుద్ధం ముగిసిందని భావించి స్వదేశానికి వెళ్లిపోవాలని చూస్తున్న జపనీస్ సైన్యం.. మరోవైపు ఇంతకాలం కొరియాపై దండయాత్ర చేసిన శత్రువులను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్న ఓ లెజెండరీ నావికాదళ అధిపతి. మధ్యలో రాజకీయ కుట్రలు, లంచాలు, వ్యూహాలు.. చివరికి సముద్రంపైనే వేలాది సైనికుల మధ్య జరిగే భీకర యుద్ధం. పరిస్థితులు ఇంతలా మారడానికి అసలు కారణమేంటి? శత్రువులు తప్పించుకుంటారా? దేశాన్ని కాపాడేందుకు అడ్మిరల్ యి సన్-షిన్ ఎలాంటి వ్యూహం రచించాడు? ఈ ఉత్కంఠభరితమైన చారిత్రక యాక్షన్ డ్రామానే ‘నోర్యాంగ్ డెడ్లీ సీ’ (Noryang Deadly Sea). మరి ఈ వార్ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1598 శీతాకాలంలో మొదలవుతుంది. ఇమ్జిన్ యుద్ధం ఏడో సంవత్సరంలోకి వచ్చిన సమయంలో జపాన్ పాలకుడు టోయోటోమీ హిదేయోషి మరణిస్తాడు. దీంతో కొరియాలో ఉన్న జపనీస్ సైన్యం వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. కానీ కొరియాపై జరిగిన దాడులకు ముగింపు పలకాల్సిందేనని భావించిన అడ్మిరల్ యి సన్-షిన్ మాత్రం శత్రువులను అంత సులభంగా తప్పించుకోనివ్వకూడదని నిర్ణయించుకుంటాడు.

Advertisement

జోసోన్, మింగ్ దేశాల నౌకాదళాలను ఒకే దళంగా సమీకరించి జపనీస్ సైన్యానికి సముద్ర మార్గం మూసివేయాలని ప్రయత్నిస్తాడు. అయితే శత్రువులను సురక్షితంగా వెనక్కి పంపించేందుకు రాజకీయ స్థాయిలోనే పావులు కదులుతాయి. జపనీస్ కమాండర్ కొనిషి, మింగ్ కమాండర్ చెన్ లిన్ తో రహస్య ఒప్పందానికి ప్రయత్నించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తుంది. చెన్ లిన్ వెనక్కి తగ్గాలని భావించినా, యి సన్-షిన్ మాత్రం యుద్ధం తప్ప మరో మార్గం లేదని పట్టుబడతాడు. ఇలాంటి సమయంలో జపనీస్ సైన్యానికి అండగా షిమాజు నేతృత్వంలోని భారీ నౌకాదళం నోర్యాంగ్ జలసంధి వైపు కదులుతుంది. చీకటి పడిన తర్వాత సముద్రంలో మొదలయ్యే పోరాటం క్రమంగా భారీ యుద్ధంగా మారుతుంది. ఒకవైపు శత్రు నౌకలపై దాడులు.. మరోవైపు ప్రతిదాడులు… ఎటు చూసినా మంటలు, తుపాకీ శబ్దాలు, యుద్ధ నినాదాలతో సముద్రం రణరంగంగా మారుతుంది.

సైనికుల్లో ధైర్యం నింపేందుకు అడ్మిరల్ యి సన్-షిన్ స్వయంగా యుద్ధ డ్రమ్స్ మోగిస్తూ ముందుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది. కానీ యుద్ధం మధ్యలో ఎదురయ్యే అనూహ్య ప్రమాదం ఆయనకే ప్రాణాపాయ పరిస్థితిని తీసుకొస్తుంది. అయినా సైన్యం మనోధైర్యం దెబ్బతినకూడదన్న ఆలోచనతో ఆయన తీసుకునే నిర్ణయం కథలో కీలకంగా మారుతుంది. అక్కడి నుంచి యుద్ధం కేవలం గెలుపోటముల పోరుగా కాకుండా… ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే చివరి సమరంగా మారుతుంది. అసలు అడ్మిరల్ యి సన్-షిన్ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఆయన వ్యూహం ఫలించిందా ? సముద్రంలో చిక్కుకున్న జపనీస్ నౌకాదళం తప్పించుకుందా ? ఈ మహాయుద్ధం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘నోర్యాంగ్ డెడ్లీ సీ’ కొరియన్ చారిత్రక యాక్షన్ ట్రయాలజీలో చివరి భాగం. కిమ్ యూన్-సియోక్ అడ్మిరల్ యి సన్-షిన్ పాత్రలో నటించారు. భారీ సముద్ర యుద్ధాలు, చారిత్రక నేపథ్యం, దేశభక్తి, సైనిక వ్యూహాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా సముద్రంపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు ఆడియోతో చూడొచ్చు.

Read Also: ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Tags

Related News

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

Big Stories

Advertisement
×