How often clean fridge grill: ఇంట్లో ఫ్రిజ్ ప్రతిరోజూ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనం దాని లోపలి భాగాలను మాత్రమే శుభ్రం చేస్తుంటాము. వెనక ఉండే గ్రిల్ లేదా కాయిల్స్ వైపు అసలు దృష్టి పెట్టం. దీని వల్ల ఫ్రిజ్ మీద అనవసరమైన భారం పడి కరెంట్ బిల్లు విపరీతంగా పెరుగుతుంది. ఫ్రిజ్ వెనక ఉన్న ఆ గ్రిల్‌ను అసలు ఎన్ని రోజులకు ఒక సారి శుభ్రం చేయాలి? దానిని శుభ్రం చేసే సరైన పద్ధతి.. ఏంటి, దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, కూరగాయలు, పండ్లు ఇలా అన్నింటినీ తాజాగా ఉంచుకోవడానికి మనం ఫ్రిజ్‌ను ఎక్కువగా వాడతాము. అయితే ఫ్రిజ్ బాగా పనిచేయాలంటే మనం దానిని సరిగ్గా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఫ్రిజ్ లోపల ట్రేలు, డోర్లు మాత్రమే శుభ్రం చేస్తుంటారు. కానీ వెనక భాగంలో ఉండే కండెన్సర్ కాయిల్స్ లేదా గ్రిల్‌ను ఎప్పుడూ పట్టించుకోరు. ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టమే జరుగుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఫ్రిజ్ వెనక లేదా కింద ఉండే గ్రిల్‌ను సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు (అంటే ప్రతి 4 నుంచి 6 నెలలకు ఒకసారి) కచ్చితంగా శుభ్రం చేయాలి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు (కుక్కలు, పిల్లులు) ఉంటే .. లేదా ఇల్లు రోజూ దుమ్ము పడుతుంటే.. ఈ క్లీనింగ్ ప్రక్రియను ప్రతి 3 నెలలకు ఒకసారి చేయడం చాలా మంచిది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఫ్రిజ్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
ఫ్రిజ్ వెనక ఉండే కాయిల్స్ రూమ్ లోని ఉష్ణోగ్రతను బయటకు పంపే పని చేస్తాయి. వాటిపై దుమ్ము, దూలి పేరుకుపోతే హీట్ బయటకు వెళ్లడం కష్టమవుతుంది. దీని వల్ల కంప్రెషర్ మీద అదనపు భారం పడి ఫ్రిజ్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఫ్రిజ్ ఎక్కువ కరెంట్ వినియోగించుకుంటుంది. ఫలితంగా మీ కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది. అంతేకాకుండా.. ఫ్రిజ్ లోపల కూలింగ్ క్రమంగా తగ్గిపోయి ఆహార పదార్థాలు త్వరగా పాడై పోయే అవకాశం ఉంది.
ఫ్రిజ్ వెనక గ్రిల్‌ను శుభ్రం చేయడం చాలా ఈజీ. దీని కోసం మీరు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
సేఫ్టీ ఫస్ట్: ముందుగా ఫ్రిజ్ పవర్ ప్లగ్‌ను మెయిన్ సాకెట్ నుంచి డిస్కనెక్ట్ చేయండి (కరెంట్ ఆఫ్ చేయండి). ఇందుకు సేఫ్టీ చాలా ముఖ్యం.
ఫ్రిజ్ మూవింగ్: ఫ్రిజ్‌ను గోడ నుంచి కొద్దిగా ముందుకు జరుపుకోండి. వెనక భాగంలో గ్రిల్ లేదా కాయిల్స్ స్పష్టంగా కనిపించేలా చూసుకోండి.
డస్ట్ రిమూవల్: ఒక సాఫ్ట్ బ్రెస్ట్ లేదా వాక్యూమ్ క్లీనర సహాయంతో కాయిల్స్ మీద పేరుకు పోయిన దుమ్ము , బూజును మెల్లగా తొలగించండి.గట్టిగా రుద్దకండి.
తుడిచివేయడం: కొద్దిగా గోరు వెచ్చని నీటిలో మైల్డ్ సోప్ వేసి, ఒక మెత్తటి గుడ్డను తడిపి ఆ గ్రిల్‌ను శుభ్రంగా తుడవండి. ఆ తర్వాత పొడి క్లాత్ తో మరో సారి తుడిచి పూర్తిగా ఆరనివ్వండి.
రీస్టార్ట్: అన్నీ పూర్తయిన తర్వాత ఫ్రిజ్‌ను అదే చోట ఉంచి పవర్ ఆన్ చేయండి.
Also Read: చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?
ఫ్రిజ్ కాయిల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల అనేక లాభాలున్నాయి. కంప్రెషర్ పైన భారం తగ్గడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది. ఇది మీ కరెంట్ బిల్లును తగ్గిస్తుంది. అంతే కాకుండా దీని వల్ల ఫ్రిజ్ కూలింగ్ ఎఫిషియన్సీ మెరుగవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఫ్రిజ్ త్వరగా రిపేర్ రాకుండా ఎక్కువ కాలం పాడవకుండా పని చేస్తుంది.
చిన్న చిన్న మెయింటెనెన్స్ పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. ఇప్పటి నుంచైనా మీ ఇంటి ఫ్రిజ్ వెనక ఉండే గ్రిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసే అలవాటు చేసుకోండి. తద్వారా కరెంట్ బిల్లును ఆదా చేసుకోవడంతో పాటు ఫ్రిజ్‌ను ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చు.