BigTV English

Hyundai Grand i10 Nios Hy-CNG Duo: దుమ్ము దులిపేసిన హ్యుందాయ్.. సీఎన్‌జీ వెర్షన్‌లో మరో కొత్త కారు లాంచ్..!

Hyundai Grand i10 Nios Hy-CNG Duo: దుమ్ము దులిపేసిన హ్యుందాయ్.. సీఎన్‌జీ వెర్షన్‌లో మరో కొత్త కారు లాంచ్..!
Advertisement

Hyundai Grand i10 Nios Hy-CNG Duo: దేశీయ మార్కెట్‌ ఆటో మొబైల్ రంగంలో దినదినాన అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ విదేశీ వాహనాలు సైతం దేశీయ మార్కెట్‌లో తమ వాహనాలను లాంచ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు పెట్రోల్ డీజీల్ వాహనాలపై చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ కార్లను సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకొస్తున్నాయి. దీని కారణంగా వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడిప్పుడే సీఎన్‌జీ వాహనాలకు ఆదరణ లభిస్తుంది. అందులో కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది.


ఆ డిమాండ్ కారణంగానే తాజాగా ఓ బడా కార్ల తయారీ కంపెనీ సీఎన్‌జీ వెర్షన్‌లో తమ కార్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆ కంపెనీ మరేదో కాదు ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’. ఈ కంపెనీ కార్లకు దేశీయ మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే హ్యుందాయ్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే సీఎన్‌జీపై ఫోకస్ పెట్టింది. ఇంతకుముందు కంపెనీ ఎక్స్‌టర్ హై-సిఎన్‌జి డుయోను ప్రారంభించింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు తన లైనప్‌లో రెండవ సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది.

Also Read: దేశంలో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన కార్లు ఇవే!


హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ‘గ్రాండ్ ఐ10 నియోస్‌ హై-సిఎన్‌జి డుయో’ను తాజాగా దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు అతిపెద్ద బూట్ స్పేస్‌ను ఆదా చేయడానికి డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. అంతేకాకుండా Nios Hy-CNG Duo సింగిల్-సిలిండర్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హై-సిఎన్‌జి డుయో 5 స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జత చేయబడిన 1.2L Bi-Fuel ఇంజిన్‌ (CNG, పెట్రోల్)తో శక్తిని పొందుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ సున్నితమైన డ్రైవింగ్ అనుభవం కోసం ఇంటిగ్రేటెడ్ ‘ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్’(ECU)ని కూడా పొందుతుంది. ఇది పెట్రోల్, CNGతో నడుస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రయాణ అవసరాల కోసం ప్రాక్టికల్ బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.

గ్రాండ్ i10 NIOSలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRL, టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 20.25 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అదనపు ఫీచర్లలో ఫుట్‌వెల్ లైటింగ్, వెనుక AC వెంట్‌లు, టిల్ట్ స్టీరింగ్‌తో పాటు మరిన్ని ఉన్నాయి. స్టాండర్డ్, TPMS హైలైన్, రియర్ పార్కింగ్ కెమెరా, డే & నైట్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC) వంటి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. CNG మోడ్‌లో మోటారు గరిష్టంగా 69 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 95.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని అందజేస్తుంది. Grand i10 Nios Hy-CNG Duo రెండు వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది. అందులో Magna, Sportz ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 7.75 లక్షలు, రూ. 8.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Related News

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Amazon Jobs: ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఎప్పటికైనా రిస్కే.. ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధంగా వున్న సంస్థ

Big Stories

×