BigTV English

Viral Video: బోర్డర్‌లో భారత్ – పాక్ జింకల పోరాటం.. వీడియో వైరల్

Viral Video: బోర్డర్‌లో భారత్ – పాక్ జింకల పోరాటం.. వీడియో వైరల్

Viral Video: తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సార్లు ఓ ఘటనలో ఏం లేకపోయినా సరే దానిని చూసే కోణాన్ని బట్టి దాని అర్థం తెలుస్తుంది. అలాగే కొన్ని వీడియోలు సాధారణంగా ఉన్నాయనుకున్నా కూడా అందులో చాలా అర్థాలు కనిపిస్తుంటాయి. ఇలా తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.


అయితే మన దాయాది దేశమైన పాకిస్థాన్ శత్రు దేశమనే విషయం తెలిసిందే. అభివృద్ధిలో భారత్ దూసుకుపోతుండడం చూసి పాకిస్థాన్ అస్సలు ఓర్వలేదు. ఈ తరుణంలో ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉంటుంది. అయితే ఇలా ఎన్నో సార్లు చాలా అల్లకల్లోలం సృష్టించిన చరిత్ర కూడా పాకిస్థాన్ కు ఉంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి భారత్ లోకి దొంగచాటుగా ప్రవేశించి కాల్పులు, బాంబు దాడులు చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. దీంతో భారత్, పాక్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ జింకలకు సంబంధించిన వీడియో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇరుదేశాలకు చెందిన జింకలు ఒక దానిపై ఒకటి దాడి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిహద్దులో ఉన్న ఫెన్సింగ్ పై నుంచే జింకలు తలపడడం ప్రారంభించాయి. తొలుత ఒక దానిని ఒకటి చూసుకున్న జింకలు, అవి రెండు బార్డర్లకు ఇరు వైపుల ఉన్నాయని అర్థం చేసుకున్నాయి. ఈ తరుణంలో కయ్యానికి కాలు దువ్వాయి. ఏకంగా పందెం పోటీలో కోళ్లు కొట్లాటకు దిగినట్లు ప్రవర్తించాయి. అవతల పాకిస్థాన్ జింక, ఇవతల భారత్ జింక కలిసి కుమ్ములాట ప్రారంభించాయి.


ఈ తరుణంలో జింకలు ఒకదానిపై ఒకటి కుమ్ముకోవడం ప్రారంభించాయి. దీనికి సంబంధించిన దృశ్యం ఆశ్చర్యకరంగా ఉండడంతో అక్కడే ఉన్న భారత ఆర్మీ దళంలోని ఆఫీసర్లు ఓ వీడియోను చిత్రీకరించారు. జింకలు ఫైట్ చేసుకున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Related News

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Big Stories

×