BigTV English

Hyundai Venue S(O) + Variant Launched: హ్యుందాయ్ కొత్త వేరియంట్ లాంచ్.. ఈ సారి మరింత స్టైలిష్‌గా..!

Hyundai Venue S(O) + Variant Launched: హ్యుందాయ్ కొత్త వేరియంట్ లాంచ్.. ఈ సారి మరింత స్టైలిష్‌గా..!

Hyundai Venue S(O) + Variant Launched: దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL)కు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న కార్ల కోసం వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన ఈ కంపెనీ కార్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అందులో హ్యుందాయ్ వెన్యూ కారు. ఈ కారు తన ఫీచర్లతో బాగా పాపులర్ అయింది. అంతేకాకుండా బడ్జెట్ ధరలో కూడా అందులోబాటులో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు మరో వేరియంట్‌ను తీసుకొచ్చింది. తాజాగా హ్యుందాయ్ VENUE S(O) + వేరియంట్‌ను ఆవిష్కరించింది.


ఈ వేరియంట్ అధునాతన టెక్నాలజీ, కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది. హ్యుందాయ్ VENUE S(O) + వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన 1.2L కప్పా పెట్రోల్ ఇంజన్ అందించబడింది. ఇది స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అధునాతన భద్రతా లక్షణాల విషయానికొస్తే..

Also Read: దుమ్ము దులిపేసిన హ్యుందాయ్.. సీఎన్‌జీ వెర్షన్‌లో మరో కొత్త కారు లాంచ్..!


హ్యుందాయ్ VENUE S(O) + వేరియంట్‌లో సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. అంతేకాకుండా TPMS హైలైన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), బ్యాక్ కెమెరా వంటివి ఉన్నాయి. ఇక దీని ధర వివరాల విషయానికొస్తే.. హ్యుందాయ్ VENUE S(O) + వేరియంట్ రూ. 9,99,900 ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది. కాగా ఈ వాహనంలో డిజిటల్ క్లస్టర్ కలర్ TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (MID), స్పష్టమైన, యాక్సెస్ చేయగల సమాచారంతో డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

కొత్త హ్యుందాయ్ VENUE S(O) + వేరియంట్ కస్టమర్‌లకు ఆకర్షణీయమైన ధర వద్ద రిలీజ్ అయింది. ఇది స్టైల్‌గా ఉండటమే కాకుండా టెక్నాలజీలో కూడా అదరగొట్టింది. ఈ మోడల్‌లో అధునాతన ఫీచర్లు, పోటీ ధరల వలన కాంపాక్ట్ SUV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలివనుంది. దీని కారణంగానే ఈ కొత్త వేరియంట్ తన అమ్మకాల్లో సత్తా చాటుతుందని కంపెనీ భావిస్తుంది.

Related News

Jio IPO: తగ్గేదే లేదంటున్న జియో.. త్వరలో ఐపీఓ, మెటాతో కలసి AI ఎంట్రీ

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

Jio Airtel flood relief: వరద ప్రభావితులకు రిలీఫ్.. జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద గుడ్ న్యూస్!

BSNL Pay: ఫోన్ పే, గూగుల్ పే కి కాలం చెల్లినట్టేనా? రంగంలోకి దిగిన బీఎస్ఎన్ఎల్ పే..

Realme 15T Smartphone: ఏముంది రా బాబు.. రియల్‌మీ 15T స్టైలిష్ డిజైన్ లీక్

Big Stories

×