BigTV English

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ.. రెండవ స్థానంలో అంబానీ

Gautam Adani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ.. రెండవ స్థానంలో అంబానీ

Gautam Adani: బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనకకు నెట్టి ప్రథమ స్థానంలో నిలిచారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో ఉన్న అదానీ కంపెనీ షేర్లు భారీగా పెరగడంతో అతడి సంపద పెరిగింది. దీంతో అత్యంత సంపన్నుడిగా అదానీ నిలిచారు.


ప్రస్తుతం అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానానికి చేరారు. అదానీ నికర విలువ 111 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ నికర విలువ 109 బిలియన్ డాలర్లు కాగా ఆయన సంపన్నుల జాబితాలో 12వ ప్థానంలో నిలిచిపోయారు. సుప్రీం కోర్టు సానుకూల తీర్పు తర్వాత షేర్ల ధర పెరగడంతో అదానీ సంపద విలువ కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లోనే అదానీ నికర లాభం 5. 44 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

అత్యధికంగా 2024 సంవత్సరంలో సంపాదిస్తున్న బిలియనీర్లలో గౌతమ్ అదానీ ఒకరు. అదానీ జనవరి 1 2024 నుంచి ఇప్పటి వరకు 26.8 బిలియన్ డాలర్లు సంపాదించారు. కేవలం ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు పెరిగింది. 2023 జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం ఏకంగా 34 వంతు సంపద కోల్పోయారు.


Also Read: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!

అదానీకి చెందిన కంపెనీ షేర్ల విలువ భారీగా పడిపోవడంతో భారత్ తో పాటు ప్రపంచ దేశాల సంపన్నల జాబితాలో ఆయన చాలా స్థానాలు కోల్పోయారు. దాదాపు 16 నెలల తర్వాత మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ట్రేడింగ్ చివరి రోజు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో 14 శాతం పెరుగుదల పొందింది. ట్రేడింగ్ మెుగిసే సరికి 10 కంపెనీలు లాభాలను ఆర్జించాయి. దీంతో అదానీ పవర్ స్టాక్ భారీ పెరుగుదల నమోదు చేసుకుంది.

 

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×