Big Stories

Auto Sales April 2024: గతేడాది కంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆటో పరిశ్రమ జోరు.. మామూలుగా లేదుగా!

Auto Sales Increased in April 2024 in India: భారతీయ ఆటో పరిశ్రమ ఏప్రిల్ 2024 నెలలో 21,36,157 యూనిట్లను విక్రయించింది. దీంతో ఇది సంవత్సరానికి 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వెల్లడించిన డేటా ప్రకారం… భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ గత ఏడాది ఏప్రిల్ 2023లో 17,12,812 వాహనాలు సేల్ చేసింది.

- Advertisement -

అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏకంగా 21,36,157 వాహనాలను విక్రయించి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. అన్ని సెగ్మెంట్‌లు విక్రయించినట్లు సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ 2023తో పోలిస్తే ఏప్రిల్ 2024లో వృద్ధి ఘననీయంగా పెరిగింది.

- Advertisement -

కాగా ఏప్రిల్ 2024లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,35,629 యూనిట్లకు చేరాయి. ఇక గతేడాది 2023లో ఏప్రిల్ నెలలో 3,31,278 వాహనాలను విక్రయించింది. దీని బట్టి చూస్తే ఈ ఏడాది ఇది స్వల్పంగా 1.3 శాతం వృద్ధిని సాధించింది. అయితే ఇది మొత్తం ద్విచక్ర వాహన విభాగం వృద్ధికి సంబంధించింది. గత నెలలో ఆటో రంగం 17,51,393 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా ఏప్రిల్ 2023లో 13,38,588 యూనిట్లను విక్రయించింది. దీని బట్టి పోలిస్తే దాదాపు 31 శాతం భారీ వృద్ధిని సాధించింది.

Also Read: అత్యధికంగా అమ్ముడవుతున్న కియా కార్లు.. ఏప్రిల్‌లో ఎన్ని సేల్ అయ్యాయంటే?

అదే సమయంలో ఏప్రిల్ 2024లో మూడు చక్రాల వాహనాల విక్రయాలు 49,116 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 42,885 వాహనాలతో పోలిస్తే ఇది 14.5 శాతం వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2023లో విక్రయించిన 61 వాహనాలతో పోల్చితే.. క్వాడ్రిసైకిల్ విక్రయాలు 19 యూనిట్లకు 69 శాతం పడిపోయాయి.

SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ, ‘‘ప్యాసింజర్ వాహనాలు 3.36 లక్షల యూనిట్లతో అత్యధిక నెలవారీ విక్రయాల ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 2023తో పోలిస్తే ఏప్రిల్ 2024లో 1.3 శాతం స్వల్ప వృద్ధిని సాధించింది. 2023-24 క్యూ4 ట్రెండ్‌లు, ఏప్రిల్ 2023తో పోల్చితే టూ-వీలర్స్ ఏప్రిల్ 2024లో 30.8 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

Also Read: దేశంలో ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. సింగిల్ ఛార్జింగ్‌తో దూసుకుపోవచ్చు..!

దాదాపు 17.5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా.. త్రీ-వీలర్ సెగ్మెంట్ కూడా దాదాపు 0.49 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఏప్రిల్ 2023తో పోలిస్తే 2024 ఏప్రిల్‌లో 14.5 శాతం వృద్ధి సాధించింది’’ అని తెలిపారు. ఏప్రిల్ 2024 నెలలో ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల మొత్తం కలిపి వాహనాల ఉత్పత్తి 23,58,041 యూనిట్లుగా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News