UdayaBhanu:ఒకప్పుడు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా యాంకరింగ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఉదయభాను(Udaya Bhanu) అనూహ్యంగా యాంకరింగ్ మానేసి ,సినిమాలలో కొంతకాలం పనిచేసి, ఇక ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇక ఇన్నాళ్లకు నిర్మాతగా మారి ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం దీనికి మంచి రెస్పాన్స్ లభిస్తున్న నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఎన్నో విషయాలను పంచుకుంటుంది ఉదయభాను. తనకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారని , తాను సినిమాలు, షోలు చేయడం కొంతమంది మేనేజర్లకు నచ్చడం లేదని, ముఖ్యంగా కొంతమంది హీరోలు ఆటిట్యూడ్ చూపిస్తారని , అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంది అంటూ ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ మేరకు తాజాగా మరో న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ తో పాటు యంగ్ హీరోల ప్రవర్తనపై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది ఉదయభాను.
బుల్లితెర అయినా.. వెండితెర అయినా.. ఇది ఒక రంగుల ప్రపంచం.. దాని వెనుక వికృతి చేష్టలు కూడా ఉంటాయి. దానినే మనం క్యాస్టింగ్ కౌచ్ అంటాము అంటూ యాంకర్ మాట్లాడుతుండగానే.. ఉదయభాను మాట్లాడుతూ..” ఒక పెద్ద సూట్ కేసు మీ కాళ్ళ ముందుకొచ్చి ఉంటుంది. దానినిండా మొత్తం డబ్బే ఉంటుంది. అయితే అది మీ ఛాయిస్.. దాన్ని నువ్వు తీసుకుంటావా? లేదా ? లెఫ్ట్ లెగ్గుతో దాన్ని తంతావా? అన్నది పూర్తిగా నీ ఛాయిస్.. ” అంటూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కాకపోతే అది పూర్తిగా మన నిర్ణయమే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనకు ఏది ఎలా అవసరమో అలాగే కనిపిస్తుందని, అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉదయభాను కూడా ఇదే మాటలను తెలియజేయడంతో మంచైనా చెడైనా ఏదైనా మన ప్రవర్తనలోనే ఉంటుంది అంటూ మరొకసారి నిరూపితమైంది.
ALSO READ:బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చరణ్, చైత్ర.. వీడియో వైరల్!
ఇదే ఇంటర్వ్యూలో మీరు హీరోయిన్గా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఉంటాయి. మాట్లాడే తీరు బాగుండదు.. చూపు బాగుండదు.. స్వార్థం ఎక్కువ అందుకే నాకు ఇండస్ట్రీలో అవకాశాలు లభించలేదు. నేను ఎక్కువ కాలం ఉండలేకపోయాను అంటూ తెలిపింది ఉదయభాను.. నా ప్రొడక్షన్ హౌస్ కూడా నేను ఊరికే ప్రారంభించలేదు. దాని వెనుక ఎన్నో అవమానాలు, హేళనలు, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటినీ తట్టుకొని ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా అడుగు పెట్టాను అంటూ తెలిపింది.
బాలకృష్ణతో స్పెషల్ బాండింగ్ పై కూడా ఆమె నోరు విప్పారు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న హీరోలే చూస్తే ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అని ముఖం తిప్పుకొని వెళ్తున్నారు. కానీ బాలయ్య అలా కాదు.. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా సరే ప్రతి ఒక్కరినీ పలకరిస్తారు. ఆయన నిజంగా నా దృష్టిలో దేవుడు అంటూ బాలకృష్ణతో ఉన్న స్పెషల్ బాండింగ్, ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది.