E-Paper
Advertisement

తెల్లవారుజామునే ఉద్యోగులకు భారీ షాకిచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. వేల సంఖ్యలో ఫైరింగ్

తెల్లవారుజామునే ఉద్యోగులకు భారీ షాకిచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. వేల సంఖ్యలో ఫైరింగ్
Advertisement

Software Job Layoffs| ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి ఈమెయిల్ వస్తుంది. అందులో మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ ఉంటుంది. అది చదవగానే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది నిజంగా జరిగింది. ఒక దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉదయం 6 గంటలకు దాదాపు 6000 నుంచి 7000 మంది ఉద్యోగులకు ఇలాంటి ఈమెయిల్ పంపినట్లు సమాచారం. ఇదంతా జరిగింది ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్‌లో. 2026లో ఇప్పటికే కంపెనీ దాదాపు 21000 మందిని తొలగించగా.. ఇప్పుడు జరుగుతున్న ఫైరింగ్ సెకండ్ రౌండ్.

అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. తాజా లేఆఫ్స్‌పై ఒరాకిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో కూడా కంపెనీ వెల్లడించలేదు.

ఉద్యోగులకు ఉదయాన్నే లేఆఫ్ ఈమెయిల్ పంపిన ఒరాకిల్

Advertisement

సెప్టెంబర్ 14న ఒరాకిల్‌లో కొత్త ఉద్యోగ కోతలు ప్రారంభమైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి. కొందరు ఉద్యోగులకు ఉదయాన్నే తమ ఉద్యోగాలు తొలగించినట్లు ఈమెయిల్స్ అందాయి. కంపెనీ అధికారికంగా ఇప్పుటివరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని లింక్డ్‌ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు.
అయితే, తాజా ఉద్యోగ కోతల మొత్తం సంఖ్యను ఒరాకిల్ ఇంకా వెల్లడించలేదు.

ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న ఒరాకిల్

ఉద్యోగ కోతలు జరుగుతున్న సమయంలో ఒరాకిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగా పెట్టుబడులు చేస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ క్యాపిటల్ వ్యయంగా 28.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఖర్చు చేసిన 8.5 బిలియన్ డాలర్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరానికి 90 నుంచి 95 బిలియన్ డాలర్ల క్యాపిటల్ వ్యయాన్ని ఒరాకిల్ అంచనా వేస్తోంది.
అదే సమయంలో కంపెనీకి ఏఐ క్లౌడ్ సర్వీస్‌లపై భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈ త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పైగా కొత్త ఏఐ క్లౌడ్ ఒప్పందాలు కుదిరినట్లు కంపెనీ తెలిపింది.

ఇప్పటికే 21 వేల ఉద్యోగాలను తగ్గించిన ఒరాకిల్

Advertisement

తాజా లేఆఫ్స్‌కు ముందు కూడా ఒరాకిల్ భారీగా ఉద్యోగాలను తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 1.41 లక్షలకు చేరింది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య సుమారు 1.62 లక్షలుగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో దాదాపు 21 వేల ఉద్యోగాలు తగ్గాయి. ఈ ఉద్యోగ కోతలకు సంబంధించి ఒరాకిల్ సుమారు 1.84 బిలియన్ డాలర్లను సెవరెన్స్, ఇతర ఖర్చుల కోసం వెచ్చించింది.

పెరుగుతున్న రీస్ట్రక్చరింగ్ ఖర్చులు

ఒరాకిల్ తన రీస్ట్రక్చరింగ్ ఖర్చుల అంచనాను మరో 700 మిలియన్ డాలర్లు పెంచింది. దీంతో మొత్తం అంచనా ఖర్చు సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో ఉద్యోగుల సెవరెన్స్, కాంట్రాక్ట్ ముగింపు ఖర్చులు ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి కంపెనీ ఇప్పటికే సుమారు 2.1 బిలియన్ డాలర్ల రీస్ట్రక్చరింగ్ ఛార్జీలను నమోదు చేసింది.

Also Read: ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఒకవైపు ఏఐ వృద్ధి, మరోవైపు ఉద్యోగ కోతలు

ఒరాకిల్ ప్రస్తుతం ఏఐ, క్లౌడ్ వ్యాపారంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అదే సమయంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగి 19.3 బిలియన్ డాలర్లకు చేరింది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం ఏకంగా 121 శాతం పెరిగి 7.4 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వృద్ధికి భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అందుకే ఒరాకిల్ ప్రస్తుతం ఏఐ విస్తరణతో పాటు ఖర్చుల నియంత్రణపై కూడా దృష్టి పెట్టింది.

Related News

ఆసుపత్రి బిల్లు తగ్గాలంటే హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఈ 5 అంశాలు తప్పనిసరి.. మీ పాలసీలో ఉన్నాయా?

దిగొస్తున్న బంగారం ధర.. మహిళల్లో ఒక్కటే ఆనందం, ఇవాళ మార్కెట్ ధరల మాటేంటి?

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

Big Stories

Advertisement
×