E-Paper
Advertisement

తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా?  సీటు కన్ఫర్మ్ కావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
Advertisement

Tatkal Ticket Booking Tips: పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అందులో భాగంగానే దుర్గా పూజ, దీపావళి, ఛత్ పూజ సమీపిస్తున్న నేపథ్యంలో రైలు టికెట్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. సాధారణ టికెట్లు దొరకకపోవడం, వెయిటింగ్ లిస్ట్ పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ప్రయాణీకులకు తత్కాల్ టికెట్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తాయి. కానీ, వీటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సీట్లు అయిపోతాయి. అయితే, తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో కొద్దిగా ముందస్తు ప్రణాళిక ఉంటే ఈజీగా టికెట్ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం పాటించాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బుకింగ్ సమయానికి ముందే లాగిన్ అవ్వండి!

తత్కాల్ బుకింగ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందే మీ అకౌంట్ లోకి లాగిన్ అయి సిద్ధంగా ఉండండి. దీంతో బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్ ప్రక్రియను మొదలుపెట్టవచ్చు.

ప్రయాణీకుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి!

Advertisement

టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రతి ప్రయాణీకుడి పేరు, వయస్సు, లింగం లాంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే ఈ పని మరింత సమయం తీసుకుంటుంది. IRCTCలోని ‘మాస్టర్ లిస్ట్’ సదుపాయాన్ని ఉపయోగించి ప్రయాణీకుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఆయా ప్రయాణీకుడి వివరాలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టైమ్ సేవ్ చేసుకోవచ్చు.

రైలు వివరాలను ముందే రెడీ చేసుకోండి!

తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత రైలు కోసం వెతకడం, స్టేషన్లను నిర్ణయించుకోవడం కంటే, ముందే, ప్రయాణించాలనుకుంటున్న రైలు నంబర్, ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్, ప్రయాణ తేదీ లాంటి వివరాలను ముందుగానే తెలుసుకోండి. ఒకటి కంటే ఎక్కువ రైళ్లను ప్రత్యామ్నాయంగా సెలెక్ట్ చేసుకుంటే, మొదటి రైలులో సీట్లు అందుబాటులో లేకపోయినా మరో రైల్లో ప్రయత్నించవచ్చు.

ఇంటర్నెట్ కనెక్షన్‌ ను చెక్ చేసుకోండి!  

Advertisement

బుకింగ్ సమయంలో ఇంటర్నెట్ స్లోగా ఉండటం, తరచూ కనెక్షన్ రాకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సో, ముందుగానే ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసుకోవడం మంచిది. వై-ఫై, మొబైల్ డేటాలో ఏది చక్కగా పని చేస్తే దానిని ఉపయోగించుకోవాలి.

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ గుర్తుంచుకోండి!

సాధారణంగా ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, నాన్-ఏసీ తరగతుల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయాలు రైలు ప్రారంభమయ్యే తేదీకి ఒక రోజు ముందు అందుబాటులోకి వస్తాయి.

డబ్బు చెల్లింపు విధానాన్ని ముందే ఎంచుకోవాలి!   

టికెట్ వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత చెల్లింపు దశలో ఆలస్యం జరిగితే బుకింగ్‌కు ఇబ్బంది కలగవచ్చు. అందుకే ముందుగానే మీకు సౌకర్యంగా ఉండే UPI, డెబిట్, క్రెడిట్ కార్డు లాంటి చెల్లింపు పద్ధతిని రెడీగా ఉంచుకోవాలి.

 తొందరపడి రిఫ్రెష్ చేయవద్దు!

వెబ్‌సైట్ స్లో అయినప్పుడు పదేపదే బ్యాక్,  రిఫ్రెష్ బటన్లను ఎంటర్ చేయకూడదు. పేజీ లోడ్ అవుతున్నప్పుడు కాసేపు వెయిట్ చేయడం మంచిది. స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తూ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.

టికెట్ వచ్చిన తర్వాత వివరాలను చెక్ చేయండి!

బుకింగ్ పూర్తయిన వెంటనే PNR నంబర్, రైలు వివరాలు, ప్రయాణ తేదీ, బోర్డింగ్ స్టేషన్, ప్రయాణీకుల పేర్లు లాంటి సమాచారాన్ని పరిశీలించండి. టికెట్‌ లో ఏదైనా తప్పు కనిపిస్తే, సంబంధిత అధికారులకు చెప్పి మార్పులు చేయించుకోవాలి.

Read Also: భారత్‌కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్‌ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!

Tags

Related News

తక్కువ ధరలో IRCTC కాశ్మీర్ టూర్.. ఫ్లైట్, హోటల్, ఫుడ్ అన్నీ అందులోనే!

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. ఊడిన విమానం టైరు, ప్రయాణికులు అరుపులు, కేకలు

వావ్ అన్న వావ్.. ఇది బోగాపురం ఎయిర్‌పోర్ట్ కాదు, వినాయక మండపం!

జలపాతంలో ఒళ్లు జలదరించే ఘటన.. పై నుంచి పాము పడటంతో..

39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

ఈ రైలు ఎక్కితే ఆహారం ఉచితం.. జనరల్ నుండి AC వరకు.. వేడివేడి భోజనం!

14 బోగీలు.. 400 మంది ప్రయాణికులు.. భారత తొలి రైలు ప్రయాణం ఎలా సాగిందంటే!

Big Stories

Advertisement
×