Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు 10వ సీజన్ కూడా ప్రారంభం అయ్యింది.. అయితే ఎవరూ ఊహించని విధంగా మొదటి వారమే, అందులోనూ ఎలిమినేషన్ పేరిట ఆర్ జే చరణ్ (R.J. Charan ), చైత్ర రాయ్ (Chaitra Rai) లను ఎలిమినేట్ చేసి ఆశ్చర్యపరిచారు. వీరిద్దరిని సీక్రెట్ రూమ్ లో ఉంచారని తర్వాత వీరిని హౌస్ లోకి తీసుకొస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ మొదటివారం వీకెండ్ లో భాగంగా హోస్ట్ నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ సీక్రెట్ రూమ్ లో లేరు.. డైరెక్ట్ గా ఇంటికి పంపించేసాం అంటూ సడన్ షాక్ ఇచ్చారు. అంతేకాదు వీరితో లైవ్ లో కూడా మాట్లాడించి క్లారిటీ ఇచ్చారు నాగార్జున.
ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి మళ్లీ వాళ్లకు ఛాన్స్ ఉండదు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీస్ హౌస్ లోకి అడుగు పెడతారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సడన్గా ఆర్జే చరణ్, చైత్ర రాయ్ వీడియోలతో షాక్ ఇచ్చారు. తాము మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నామని అయితే ఎంట్రీ ఇవ్వాలి అంటే తమకు ఆడియన్స్ సపోర్టు కావాలి అంటూ వీడియోలు విడుదల చేశారు.
ALSO READ:ఇండస్ట్రీలో గ్రూపులు.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!
ఈ మేరకు ఆర్ జె చరణ్ ఒక వీడియో విడుదల చేస్తూ.. “బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. దానికి మీ కంప్లీట్ సపోర్ట్ కావాలి. ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సెప్టెంబర్ 16 మధ్యాహ్నం వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నా నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి.. నాకు ఓటు వేసి.. సపోర్ట్ చేసి.. నన్ను మళ్ళీ హౌస్ లోకి పంపించండి అంటూ ఆర్ జె చరణ్ ఒక రిక్వెస్ట్ వీడియో విడుదల చేశారు.
అటు చైత్ర రాయ్ కూడా తనకు ఓటు వేయండి అని, తాను రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది. “ఒకే ఒక్క అవకాశం నా పునరాగమనానికి తలుపు తెరుచుకుంది.. ఇప్పుడు మీరు వేసే ఓటే నా రీ ఎంట్రీని నిర్ణయిస్తుంది. మరింత ఆత్మవిశ్వాసం, ధైర్యం , పట్టుదలతో బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నటన లేదు.. వెనకడుగు వేయడం లేదు.. కేవలం చైత్ర.. చైత్ర గానే వస్తుంది. మీరు నన్ను తిరిగి తీసుకొస్తే ప్రతి టాస్క్ లో, ప్రతి ఛాలెంజ్ లో, ప్రతి క్షణంలో నా వంద శాతం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను.. మనసుపెట్టి ఆడతాను. న్యాయంగా ఉంటాను.ఆట కఠినంగా మారినప్పుడు దృఢంగా నిలబడతాను. పునరాగమనానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఓటు వేసి నన్ను హౌస్ లోకి మళ్ళీ తీసుకురండి” అంటూ కోరింది.
?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==