Investment Plan: రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కీలక దశ. ఈ దశలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో Systematic Withdrawal Plan (SWP) ఒక ఉత్తమ పెట్టుబడి వ్యూహంగా ఉంటుంది. SWP ద్వారా మీరు క్రమంగా నిర్ణీత మొత్తాన్ని ఉపసంహరించుకుంటూ మిగిలిన పెట్టుబడిపై కూడా లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
Systematic Withdrawal Plan (SWP) అంటే ఏమిటి?
SWP అనేది మీ పెట్టుబడిపై నిర్ణీత కాలంలో, నిర్ణీత మొత్తం ఉపసంహరించుకునే పెట్టుబడి ప్రణాళిక. మిగిలిన మొత్తంపై మీరు 12% (సగటు) రాబడి కూడా పొందుతారు. ఇది ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం చూసేవారికి మంచి ఎంపిక మార్గం. రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఎక్కువ మందికి SWP ప్రయోజనం పొందుతారు. మీరు నెలవారీగా లేదా త్రైమాసికంగా ఉపసంహరించుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా కలిగి ఉంటారు.
పెట్టుబడి వివరాలు
ఉదాహరణకు రూ. 2 లక్షల పెట్టుబడిని 30 ఏళ్లపాటు పెట్టి, తర్వాత నెలకు ఒక నిర్ణీత మొత్తం ఉపసంహరించుకుంటే ఎంత వరకు లాభం పొందవచ్చో తెలుసుకుందాం.
మీ ప్రారంభ పెట్టుబడి: రూ. 2,00,000
పెట్టుబడి కాలం: 30 సంవత్సరాలు
అంచనా రాబడి రేటు: 12% (సగటు)
తీసుకునే కాలం: రిటైర్మెంట్ తర్వాత 30 సంవత్సరాలు
ప్రత్యేక లక్ష్యం: రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం పొందడం
నెలకు రూ. 30 వేలకుపైగా
30 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం విలువ (12% CAGR) = రూ. 59,92,000. ఆ వచ్చిన మొత్తాన్ని మీరు మ్యూచువల్ ఫండ్ లేదా బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నా కూడా సాధారణ వడ్డీ రేటు 7 శాతం ప్రకారం చూసినా కూడా నెలకు రూ. 30 వేలకుపైగా రాబడి పొందే అవకాశం ఉంటుంది.
SWP ద్వారా లాభాలు
నిరంతర ఆదాయం: రిటైర్మెంట్ తర్వాత నెలవారీ స్థిర ఆదాయాన్ని పొందవచ్చు.
కంపౌండెడ్ రాబడి: మిగిలిన మొత్తం మీద కూడా లాభం.
ప్రమాద రహిత పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా మిడ్-రిస్క్ ప్లాన్.
ఆర్థిక భద్రత: రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే అవకాశం.
రిటైర్మెంట్ తర్వాత నెలకు స్థిర ఆదాయాన్ని పొందాలనుకుంటే Systematic Withdrawal Plan మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు