BigTV English

OTT: ప్రముఖ తెలుగు ఓటీటీలో భారీగా లేఆఫ్స్.. కారణం ఇదేనా?

OTT: ప్రముఖ తెలుగు ఓటీటీలో భారీగా లేఆఫ్స్.. కారణం ఇదేనా?

OTT: ఓటీటీ అనేది ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. కేవలం థియేటర్ల వరకే పరిమితమయిన సినిమాలను బుల్లితెరపైకి తీసుకొచ్చి.. ఇంట్లో అందరూ కలిసి కొత్త సినిమాలను ఎంజాయ్ చేసే సౌలభ్యం లభించేలా చేసింది. అందుకే ఈరోజుల్లో ఎవరైనా ఏదైనా సినిమాను థియేటర్లలో మిస్ అయితే పెద్దగా ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే అవి కొన్నాళ్ల తర్వాత ఓటీటీలో వచ్చేస్తుందిలే అని ధీమా. అలా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఒకదానికి మించి మరొకటి లాభాలు అందుకుంటూ దూసుకుపోతున్నాయి. కానీ ఒక ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రం నష్టాల్లో ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


తీరు మారింది

లేఆఫ్స్ అనేవి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మాత్రమే కాదు.. నష్టాల్లో ఉన్న ఏ కంపెనీలో అయినా సహజమే. అలాగే ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా నష్టాల్లో ఉండడం వల్ల లేఆఫ్స్ బాటపట్టిందని సమాచారం. ఇప్పటికే నష్టాల వల్ల ఆ కంపెనీ నుండి చాలామంది ఉద్యోగులను తొలగించారట. గత కొన్నిరోజుల్లో దాదాపుగా 75 మంది ఉద్యోగులను ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తొలగించినట్టుగా సమాచారం. మార్కెట్‌లో ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత దానికి వచ్చిన టాక్‌ను బట్టి, కలెక్షన్స్‌ను బట్టి దానికి ఓటీటీ సంస్థలు ఒక రేటు నిర్ణయించేవి. కానీ ఇప్పుడు అలా కాదు.


అందుకే లేఆఫ్స్

సినిమాల కొనుగోలు విషయంలో ఓటీటీ సంస్థల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఒక మూవీ థియేటర్లలో విడుదల అవ్వకముందే దాని బాక్సాఫీస్ స్టామినాను అంచనా వేసి దానిని కొనుగోలు చేయడానికి సంస్థలు అన్నీ ముందుకొస్తున్నాయి. ఇక పాన్ ఇండియా అనే ట్యాగ్‌తో తెరకెక్కుతున్న చిత్రాలు అయితే షూటింగ్ ప్రారంభం అవ్వకముందే ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు అమ్మేస్తున్నాయి. అలా వేగంగా ఆలోచించి ముందడుగు వేసిన ఓటీటీ సంస్థలకే ఎక్కువగా సినిమాలు దక్కుతున్నాయి. అలా చేయలేని ఇలాంటి ఓటీటీ సంస్థలు నష్టాల్లోకి వెళ్లిపోయి లేఆఫ్స్ బాటపట్టక తప్పడం లేదు. ఇప్పుడు రీజియనల్ సినిమాల విషయంలో కూడా ఓటీటీల్లో పోటీ భారీగా పెరిగిపోయింది.

Also Read: యూట్యూబర్‌కు రూ.8 కోట్ల విలువైన ఇల్లా..! సన్నీ యాదవ్ ఆస్తులు బయటపెట్టిన ప్రపంచ యాత్రికుడు.!

నెట్‌ఫ్లిక్స్‌తో పోటీ కష్టం

నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక నేషనల్ ఓటీటీ సంస్థ. అయినా కూడా ఈమధ్య తెలుగు సినిమాలను కొనుగోలు చేయడానికి నెట్‌ఫ్లిక్స్ చాలా ఆసక్తి చూపిస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌తో పోటీపడి అంత పెట్టుబడి పెట్టలేక ఈ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చతికిలపడిందని టాక్ వినిపిస్తోంది. పైగా దీనికి మ్యానేజ్మెంట్ మారడంతో వారు తీసుకునే నిర్ణయాల వల్ల సబ్‌స్క్రైబర్స్ బాగా తగ్గిపోయారు. దీంతో నష్టాలు కూడా భారీగానే ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం ఆ ఓటీటీలో ఒక సీనియర్ హీరో చేస్తున్న షో తప్పా మరే ఇతర షో గానీ, సినిమాలు గానీ సబ్‌స్క్రైబర్లను అట్రాక్ట్ చేసేలా లేవని, అందుకే త్వరలోనే ఈ తెలుగు ఓటీటీ మరిన్ని నష్టాలు చవిచూడక తప్పదని నిపుణులు భావిస్తున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×