BigTV English

Revolt RV400: ఒక్క రూపాయి కట్టకుండానే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనేయొచ్చు.. సింగిల్ ఛార్జింగ్‌పై 150 కి.మీ మైలేజీ!

Revolt RV400: ఒక్క రూపాయి కట్టకుండానే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనేయొచ్చు.. సింగిల్ ఛార్జింగ్‌పై 150 కి.మీ మైలేజీ!
Advertisement

Revolt RV400 Electric Bike: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ రివోల్ట్ ఆటో మొబైల్ మార్కెట్‌లో కొత్త కొత్త వాహనాలను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి విడుదలైన ద్విచక్ర వాహనాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంపెనీ తన వాహనాల సేల్స్ మరింత పెంచుకునేందుకు తరచూ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ పెంచుకోవడానికి కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.


ఈ స్కీమ్ ప్రకారం.. కస్టమర్లకు revolt rv400 electric bikeపై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌‌పై ఆసక్తి ఉన్న కస్టమర్లు జీరో డౌన్ పేమెంట్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్‌ను జీరో డౌన్ పేమెంట్‌తో కొనుక్కున్న కస్టమర్లు ఈఎంఐ ద్వారా నెలకు రూ.4,444 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఈఎంఐ ద్వారా కొనుక్కోవాలంటే ఎలాంటి శాలరీ బేస్డ్ సర్టిఫికేట్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూళు చేయరు.

ఈ స్కీమ్‌కు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని పేపర్‌పై కాకుండా డిజిటల్ ప్రాసెస్ ద్వారా కస్టమర్లు పొందుతారు. రివోల్ట్ కంపెనీ తన వాహనాల సేల్స్‌ను పెంచడానికి.. అలాగే ఎలక్ట్రిక్ టూ వీటర్స్‌ను మార్కెట్‌లోకి అత్యంత వేగంగా తీసుకెళ్లడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి స్కీమ్‌లను, డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. ఇటీవలే అంటే ఈ ఏడాది మే నెలలో కంపెనీ revolt rv400 బైక్‌ స్టాండర్డ్, బీఆర్జెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ మోడళ్లపై దాదాపు రూ.5000 డిస్కౌంట్ అందించింది.


Also Read: ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?

revolt rv400 electric bike features and specifications

revolt rv400 electric bike ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 3 కిలో వాట్ల (మిడ్ డ్రైవ్) మోటార్, 72వీ, 3.24 కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో కలిపి వస్తుంది. revolt rv400 electric bikeకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 150 కి.మీ మైలేజీ అందిస్తుంది. కాగా ఈ బైక్ గంటలకు 85 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది. దీనికి 15 ఏ సాకెట్ నుంచి ఫుల్‌గా ఛార్జింగ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం అవుతుంది. revolt rv400 electric bike బైక్ మొత్తం మూడు రైడింగ్ మోడలలో అందుబాటులో ఉంది. అవి ఎకో, నార్మల్, స్పోర్ట్.

కాగా ఈ బైక్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా తయారుచేయబడ్డ భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ బైక్. ఇందులో సస్సెన్షన్ సిస్టమ్ విషయానికొస్తే.. బైక్ ఫ్రట్ భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ సర్దుబాటు చేయగల మోనోషాక్స్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఇది రియల్ టైమ్ ఇన్‌ఫర్మేషన్, రిమోట్ స్మార్ట్ సపోర్ట్, ఓటీఏ అప్డేట్ సపోర్ట్, జియో ఫెన్సింగ్, బైక్ లొకేటర్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఈ బైక్‌లో అందించబడ్డాయి.

Tags

Related News

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

LIC BIMA Lakshmi: తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ కొత్త పాలసీ.. బీమా లక్ష్మి ప్లాన్ వివరాలు ఇలా!

Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?

JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?

Big Stories

×