BigTV English
Advertisement

Eight year old rape murder: ఏపీలో మరో దారుణం..బిస్కెట్లు ఆశచూపి 8ఏళ్ల బాలికపై హత్యాచారం

Eight year old rape murder: ఏపీలో మరో దారుణం..బిస్కెట్లు ఆశచూపి 8ఏళ్ల బాలికపై హత్యాచారం

Minor girl rape & murder in AP(Andhra pradesh today news): ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల నంద్యాలలో ఎనిమిది ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేపి చేసి ఆపై బాలికను కాల్వలో పడేసిన ఘటన భయాందోళనకు గురిచేస్తుంది. అయితే నంద్యాల జిల్లా మచ్చుమర్రి బాలిక ఘటన మరచిపోక ముందే విజయనగరం జిల్లాలో ఆరునెలల పసికందుపై తాత వరుస అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలు మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది.


తిరుపతిలో 8 ఏళ్ల బాలికను బిస్కెట్లు ఆశచూపి అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన సంఘటన రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బీహార్ కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. అయితే అదే మిల్లులో పనిచేస్తున్న మరో బీహార్ వాసి 22 ఏళ్ల దిలీప్..ఆ దంపతుల కూతురిని బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి సమీప అడవిలోకి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. తర్వాత ఎక్కడ విషయం బయటకు తెలుస్తుందని ఆ చిన్నారిని చంపేశాడు.

బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు దొరవారిసత్రం మండలంలోని రైస్ మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అందులో దిలీప్(22) కూడా పనిచేస్తున్నాడు. ఇతను గంజాయికి అలవాటు పడ్డాడు. అయితే బుధవారం గంజాయి మత్తులో 8 ఏళ్ల బాలికకు బిస్కెట్లు ఆశ చూపి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపినట్లు తెలిపారు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మేకల కాపరికి చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిచ, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులు పరిశీలించారు. అయితే రైస్ మిల్లు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించగా.. దిలీప్ బాలికను ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. బాలికను బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని చెప్పాడు. కానీ తర్వాత ఏం జరిగిందని గుర్తు లేదని పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. అయితే గంజాయి తీసుకున్నాడని, గంజాయి మత్తులో నిందితుడు బాలికపై అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: విశాఖలో స్పా బ్యూటీతో రొమాన్స్, భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

కాగా , అంతకుముందు దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే బాలికపై ఇలా జరగడం పలు ప్రశ్నలకు దారితీస్తుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

Tags

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×