Vamu Water Benefits: మన వంటింట్లో చిన్నచిన్న విత్తనాలు చాలా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని అద్భుతమైన ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అటువంటి ఒకటి వాము. సాధారణంగా వంటల్లో రుచి కోసం వాడే ఈ వాము, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా వాము నీరు అంటే వాము గింజలను నీటిలో మరిగించి తాగే పద్ధతి శరీరంలోని అనేక వ్యాధులను తగ్గించే సహజ ఔషధం. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
రోజూ ఇలా చేయండి
రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వాము వేసి ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, కొంచెం చల్లారిన తర్వాత వడకట్టి తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అమోఘంగా ఉంటాయి.
ప్రయోజనం ఏమిటి?
ముందుగా చెప్పుకోవలసిన ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. కిడ్నీలు, మూత్రాశయంలో ఉన్న రాళ్లు కరిగిపోవడం. వాములో ఉన్న సహజ రసాయనాలు కిడ్నీ రాళ్లను క్రమంగా కరిగించి బయటకు పంపేలా చేస్తాయి. అలాగే మూత్రాశయం శుభ్రంగా ఉండటానికి సహాయపడతాయి.
శ్వాసకోశ సమస్యలకు మంచి టానిక్
వాము వాటర్ తాగితే.. జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలు తరచుగా వచ్చే వారికి వాము నీరు మంచి సహజ మందుగా పనిచేస్తుంది. వాములో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తీసుకోవడం సులభం చేస్తాయి.
గ్యాస్ సమస్యలకు చెక్
గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడే వారికి ఇది దేవుడిచ్చిన వరం లాంటిది. వాములో ఉన్న ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపులో గ్యాస్, బ్లోటింగ్, అసిడిటీ లాంటివి దరిచేరనివ్వవు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వాము నీరు తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
Also Read: iPhone: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు అయిపోయాయా? ఐఫోన్ కొనాలనుకునే వారు తప్పక చూడండి..
మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరం.
వాము నీరు కడుపులో ఉన్న వ్యర్థాలను సులభంగా బయటకు పంపిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయడంతో మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులకు ఉపశమనం
ఇక వాపులు, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది సహజమైన నొప్పి నివారకం లాంటిది.
వాములో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గించి కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి.
శరీరంలో కొవ్వు కరిగించడం
వాము నీరు మెటబాలిజం వేగాన్ని పెంచుతుంది. దాంతో శరీరంలో పేరుకున్న కొవ్వు క్రమంగా కరిగి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. సహజంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ వాము నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది.
షుగర్ కంట్రోల్
ఇక షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచడంలో కూడా వాము నీరు సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీడయాబెటిక్ గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను సమతుల్యం చేస్తాయి. షుగర్ ఉన్నవారు దీన్ని రెగ్యులర్‌గా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
మితంగా వాడండి .. అతిగా వద్దు
అయితే, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ మందు అయినా మితంగా తీసుకోవాలి. వాము నీటిని రోజుకు ఒకసారి మాత్రమే తాగడం సరిపోతుంది. ఎక్కువగా తాగితే జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర సులభంగా దొరికే వాము గింజలు మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత ఔషధం. మీరు కూడా ఈరోజు నుంచే వాము నీరు తాగే అలవాటు వేసుకుంటే, శరీరం తేలికగా, ఆరోగ్యంగా ఉంటుంది.