BigTV English

Guava: వీళ్లు జామ కాయలు అస్సలు తినకూడదు, పొరపాటున తిన్నారో..

Guava: వీళ్లు జామ కాయలు అస్సలు తినకూడదు, పొరపాటున తిన్నారో..
Advertisement

Guava: జామపండులో అపారమైన పోషక విలువలు దాగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు.. రోగ నిరోధక శక్తికి, రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి. అంతే కాకుండా కొన్ని రకాల వ్యాధుల బారిన  పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామపండు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదా పూర్తిగా నివారించాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు :
జామ పండులో అధిక మొత్తంలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ (సహజ చక్కెర) ఉంటాయి. ఈ రెండు పదార్థాలను శరీరం అధికంగా తీసుకున్నప్పుడు.. జీర్ణక్రియ కష్టమై పేగులలో పులియబెట్టి, గ్యాస్ ,ఉబ్బరానికి దారితీస్తుంది. ముఖ్యంగా.. ఫ్రక్టోజ్ మాలాబ్సార్ప్షన్ ఉన్న వారు జామపండు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కుంటారు. అంతేకాకుండా.. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కూడా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో గ్యాస్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే.. తరచుగా ఉబ్బరం సమస్యతో బాధపడేవారు జామ పండును తినడం చాలా వరకు తగ్గించాలి లేదా తినకుండా ఉండటం మంచిది. రాత్రి పడుకునే ముందు జామ పండు తింటే జీర్ణక్రియ ఆలస్యమై ఉబ్బరం మరింత పెరిగే అవకాశం ఉంది.

2. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ :
ఐబిఎస్ అనేది పెద్ద పేగులను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక సమస్య. జామపండులో కరిగే, కరగని ఫైబర్‌ల మిశ్రమం అధికంగా ఉంటుంది. సాధారణంగా.. ఈ ఫైబర్ జీర్ణ క్రియకు సహాయ పడుతుంది. కానీ ఐబిఎస్ లేదా అతి సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఫైబర్ మరిన్ని సమస్యలను కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. అధిక ఫైబర్ పేగులలో కదలికను పెంచి, కడుపు తిమ్మిరి, అసౌకర్యం, ఉబ్బరం లేదా విరేచనాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఐబిఎస్ రోగులు జామపండు తినాలనుకుంటే.. డాక్టర్‌ని వైద్యుడిని లేదా పోషకాహార నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే పరిమిత మోతాదులో తీసుకోవడం సురక్షితం.


3. డయబెటిస్:
జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండు అయినప్పటికీ.. అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. షుగర్ పేషెంట్లు బాధపడేవారు జామపండును తక్కువగా తినాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా.. జామ ఆకుల సారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. అందుకే.. డయాబెటిస్ ఉన్న వారు, మందులు తీసుకుంటున్న వారు జామ ఆకుల సారాన్ని తీసుకుంటే.. మందుల ప్రభావం రెట్టింపు అయ్యి, రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. మధుమేహం ఉన్న వారు జామపండు లేదా దాని ఉత్పత్తులను తీసుకునే ముందు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయాలి. లేదా డాక్టర్ల సలహా తీసుకోవాలి.

4. సున్నితమైన చర్మ సమస్యలు:
జామపండు, దాని ఆకులలో కొన్ని క్రియాశీలక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారికి.. ముఖ్యంగా తామర లేదా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవారికి చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. జామ ఆకుల సారం చర్మానికి అప్లై చేసినా లేదా పండును అధికంగా తీసుకున్నా ఎరుపు, దురద లేదా వాపు వంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే.. తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నవారు జామపండును.. ముఖ్యంగా జామ ఆకుల సారాన్ని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.

Related News

Potassium Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే సమస్యలు తప్పవు

Sleeping: ఎక్కువగా నిద్రపోతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు !

Hair Breakage: జుట్టు చిట్లిపోతోందా ? కారణాలు తెలిస్తే నోరెళ్లబెడతారు !

National Slap Your Coworker Day: తోటి ఉద్యోగుల చెంప చెల్లుమనిపించే రోజు, ఏంటీ ఇలాంటిదీ ఒకటి ఉందా?

Vamu Water Benefits: ఖాళీ కడుపుతో వాము నీరు తాగితే ఈ మార్పులు గ్యారంటీ.. రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు

Sunflower Seeds: రోజూ ఇవి తింటే గుండెజబ్బులు మాయం… క్యాన్సర్ దూరం

Boiled Peanuts Benefits: ఉడకబెట్టిన వేరుశనగలు తింటున్నారా? మీ ఆరోగ్యం ఇలా మారిపోతుంది..

Big Stories

×